New Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థానానికి కొత్త పాలకమండలి.. చిరంజీవి సతీమణి సురేఖకు అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (వైటీడీ)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలకమండలిని నియమించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నమూనాలో మొత్తం 18 మంది సభ్యులతో ఈ పాలకమండలిని ఏర్పాటు చేసింది. బోర్డు ఛైర్మన్‌గా ప్రముఖ ఔషధ రంగ పారిశ్రామికవేత్త,ఎంఎస్‌ఎన్ గ్రూప్ వ్యవస్థాపకుడు,సీఎండీ డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. పాలకమండలి సభ్యులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామితో పాటు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు అవకాశం కల్పించింది. అలాగే చిలప్పగారి విజయరాజం,తూళ్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతమణి, ఎం. రాఘవేంద్ర రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్‌లను ఆలయ ఫౌండర్ ట్రస్టీ సభ్యులుగా నియమించారు.
వివరాలు
రెండేళ్ల పదవీకాలం
అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ ఛైర్మన్, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎక్స్-అఫీషియో సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఎక్స్-అఫీషియో సభ్యులు, ఫౌండర్ ట్రస్టీలను మినహాయించి మిగిలిన సభ్యుల పదవీకాలాన్ని రెండేళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండలి ఛైర్మన్‌గా నియమితులైన డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయాల నుంచి రెండు పీహెచ్‌డీలు పొందారు. ఆయన గతంలో మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన మన్నె శ్రీనివాస్ రెడ్డికి సోదరుడు కావడం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు లో చిరంజీవి సతీమణికి చోటు
Breaking News 🗞️
— Milagro Movies (@MilagroMovies) June 30, 2026
యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు లో చిరంజీవి సతీమణికి చోటు
The government has issued a GO constituting the Trust Board of the Yadagirigutta Temple.
MSN Group Chairman Manne Satyanarayana Reddy has been appointed as the Chairman of the Board.
The members include… pic.twitter.com/rNC7RfxtJC