LOADING...
Donald Trump: ట్రంప్‌కు క్రిప్టోలో భారీ లాభాలు.. 2025లోనే రూ.11 వేల కోట్లకు పైగా ఆదాయం
ట్రంప్‌కు క్రిప్టోలో భారీ లాభాలు.. 2025లోనే రూ.11 వేల కోట్లకు పైగా ఆదాయం

Donald Trump: ట్రంప్‌కు క్రిప్టోలో భారీ లాభాలు.. 2025లోనే రూ.11 వేల కోట్లకు పైగా ఆదాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు క్రిప్టో కరెన్సీ ద్వారా భారీ స్థాయిలో ఆదాయం లభించింది. వర్చువల్ కరెన్సీల్లో చేసిన పెట్టుబడుల ఫలితంగా ఆయన 2025 సంవత్సరంలోనే 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.11,358 కోట్లు) సంపాదించినట్లు అమెరికా గవర్నమెంట్ ఎథిక్స్ కార్యాలయం వెల్లడించింది. అమెరికాలో అమల్లో ఉన్న 1978 నాటి చట్టం ప్రకారం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తమ ఆస్తులతో పాటు వార్షిక ఆదాయ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. ఆ నిబంధనల మేరకు ట్రంప్ సమర్పించిన ఆర్థిక వివరాలు తాజాగా బహిరంగమయ్యాయి. వాటి ప్రకారం క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల ద్వారా ఆయనకు 2025లో భారీ ఆదాయం వచ్చినట్లు వెల్లడైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

2025లో ట్రంప్‌కు క్రిప్టో ద్వారా రూ.11 వేల కోట్లకుపైగా ఆదాయం

Advertisement