Page Loader
AP Govt: ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ.. జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం

AP Govt: ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ.. జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 24, 2024
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లకు నియమించారు. ఇందులో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. ఆర్టీసీ ఛైర్మన్‌గా టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను నియమించగా, వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ నియామకయ్యారు. .20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్, శాప్ ఛైర్మన్‌గా రవినాయుడిని ఎంపిక చేశారు. మొత్తం 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్‌ను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ‌లకు పెద్ద పీట వేశారు.

Details

జాబితా ఇదే

గృహనిర్మాణ సంస్థ- బత్తుల తాతయ్యబాబు (టీడీపీ) ఏపీ ట్రైకార్‌- బొరగం శ్రీనివాసులు (టీడీపీ) ఏపీ మారిటైం బోర్డు- దామచర్ల సత్య (టీడీపీ) సీడాప్‌- దీపక్‌రెడ్డి (టీడీపీ) మార్క్‌ఫెడ్‌- కర్రోతు బంగార్రాజు (టీడీపీ) సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌- మన్నె సుబ్బారెడ్డి (టీడీపీ) ఏపీఐఐసీ- మంతెన రామరాజు (టీడీపీ) పద్మశాలి కార్పొరేషన్‌- నందం అబద్ధయ్య (టీడీపీ) ఏపీటీడీసీ- నూకసాని బాలాజీ (టీడీపీ) ఏపీఎస్‌ ఆర్టీసీ- కొనకళ్ల నారాయణ, వైస్‌ ఛైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం (టీడీపీ) పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌- పీలా గోవింద సత్యనారాయణ (టీడీపీ) లెదర్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌- పిల్లి మాణిక్యాల రావు (టీడీపీ) వినియోగదారుల రక్షణ కౌన్సిల్‌- పీతల సుజాత (టీడీపీ) ఏపీటీపీసీ- వజ్జ బాబూరావు (టీడీపీ)

Details

జనసేన తరుపున ఎంపికైన సభ్యులు

ఎంఎస్‌ఎంఈడీసీ- తమ్మిరెడ్డి శివశంకర్‌ (జనసేన) పౌరసరఫరాల కార్పొరేషన్‌- తోట మెహర్‌ సీతారామ సుధీర్‌ (జనసేన) ఏపీ టిడ్కో- వేములపాటి అజయ్‌కుమార్‌ (జనసేన)