NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / RSS: "ఆమోదయోగ్యం కాదు": కొత్త దేవాలయం-మసీదు వివాదాలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
    తదుపరి వార్తా కథనం
    RSS: "ఆమోదయోగ్యం కాదు": కొత్త దేవాలయం-మసీదు వివాదాలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
    కొత్త దేవాలయం-మసీదు వివాదాలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

    RSS: "ఆమోదయోగ్యం కాదు": కొత్త దేవాలయం-మసీదు వివాదాలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 20, 2024
    11:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవలి కాలంలో మందిర్, మసీద్ వివాదాలు తీవ్రంగా పెరిగిపోవడం ఆందోళనకరమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం (RSS) అధినేత మోహన్ భగవత్ అభిప్రాయపడారు.

    అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఈ తరహా వివాదాలను పుట్టించి, కొంతమంది తమను హిందూ నాయకులుగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

    ఇది తనకు అంగీకారంగా లేదని ఆయన స్పష్టం చేశారు. పుణెలో నిర్వహించిన "ఇండియా-ది విశ్వగురు" అనే అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యానంలో భాగంగా, ఆయన కలుపుగోలు సమాజాన్ని ప్రోత్సహించారు.

    వివరాలు 

    రామకృష్ణ మిషన్‌లో కూడా క్రిస్మస్‌ వేడుకలు

    భాగవత్ దేశంలో సామరస్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

    తాము హిందువులు కావడంతో రామకృష్ణ మిషన్‌లో క్రిస్మస్ వేడుకలు కూడా జరిపేందుకు వారు సిద్ధమవుతారని పేర్కొన్నారు.

    మన దేశం ఎంతో కాలంగా సామరస్యంగా ఉన్నట్లుగా ఆయన వివరించారు.

    ప్రపంచానికి ఈ సామరస్యాన్ని ఉద్ధరించేందుకు భారతదేశం ఒక గొప్ప ఉదాహరణ కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

    వివరాలు 

    మనం కలిసిమెలిసి ఎలా ఉంటామో, అది భారత్‌ ప్రపంచానికి చూపించాలి. 

    "ప్రతిరోజూ కొత్త వివాదాలను పుట్టించడం సాధ్యం కాదు. ఈ విధంగా నడవడం దేశానికి మంచిది కాదు. మనం కలిసిమెలిసి ఎలా ఉంటామో, అది భారత్‌ ప్రపంచానికి చూపించాలి. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. ప్రజలు తమ ప్రతినిధులను ఎంచుకుంటారు. ఓ ప్రత్యేక వ్యక్తి ఆధిపత్యం చూపించే రోజులు పోయాయి. అందరూ భారతీయులుగా భావిస్తారు. అటువంటి సందర్భంలో ఆధిపత్య భాష, మైనార్టీ, మెజార్టీ అనే భేదాలు ఎందుకు? ప్రతి ఒక్కరూ సమానులే. తమ ఇష్టమైన దేవతను ఆరాధించడమే ఈ దేశ సంస్కృతి. కానీ, దీనికి సంబంధించిన నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా సామరస్యంగా జీవించడం అత్యంత అవసరం" అని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మోహన్ భగవత్

    తాజా

    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం

    మోహన్ భగవత్

    RSS : మ‌ణిపూర్ హింస‌కు వాళ్లే కార‌ణమన్న మోహ‌న్ భ‌గ‌వ‌త్‌.. మీడియాను గుప్పెట పట్టారని ఫైర్ ఆర్ఎస్ఎస్
    Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భద్రత పెంపు భారతదేశం
    Powerful Political Leader: అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ.. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025