NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jagdeep Dhankhar: రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌పై అవిశ్వాసం తిరస్కరణ
    తదుపరి వార్తా కథనం
    Jagdeep Dhankhar: రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌పై అవిశ్వాసం తిరస్కరణ
    రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌పై అవిశ్వాసం తిరస్కరణ

    Jagdeep Dhankhar: రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌పై అవిశ్వాసం తిరస్కరణ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 19, 2024
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు చేసిన అవిశ్వాస తీర్మానం తిరస్కరించబడింది.

    ఈ విషయాన్ని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ గురువారం వెల్లడించారు.

    ఇది వాస్తవప్రాతిపదికపై ఉండలేదని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం చట్టపరమైన కారణాలపై కాకుండా, ప్రచారం పొందే ఉద్దేశంతోనే అందులో వ్యవహారం జరిగిందని డిప్యూటీ చైర్మన్ పేర్కొన్నారు.

    జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అదే లక్ష్యంతో నిర్వహించబడినట్టు ఆయన అభిప్రాయపడ్డారు.

    అలాగే, ఇలాంటి నోటీసులు ఇవ్వాలంటే 14 రోజుల నోటీసు ఇవ్వడం తప్పనిసరి అనే నియమం పాటించబడలేదని, అలాగే ధన్‌ఖడ్‌ పేరులో స్త్రింగ్ తప్పులు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

    అయితే, 60 మంది ఎంపీల సంతకాలు తప్పనిసరి అనే ప్రొటోకాల్‌ ఒక్కటే సరైన విధంగా అనుసరించబడినట్లు తెలిపారు.

    వివరాలు 

    తీర్మానానికి  ఇండియా కూటమి నేతలు మద్దతు 

    ధన్‌ఖడ్‌ పై పక్షపాత అభ్యంతరాలు, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నదృష‌్టికోణం కలిగి ఉన్నారని ఆరోపిస్తూ,కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.

    ఆమ్ ఆమీతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపారు.

    ఇక, రాజ్యసభలో వాయిదా వివాదం కూడా జరిగింది.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా,కిరణ్ రిజిజు చేసిన ఆరోపణలపై రాహుల్ గాంధీ పై తీవ్ర దుమారం రేగింది.

    పార్లమెంట్ ప్రవేశ ద్వారం వద్ద మహిళా ఎంపీలను దాటించి రాహుల్ గాంధీ వెళ్లారని వీరు ఆరోపించారు.

    దీనిపై,మంత్రులు సభలో క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు.ఈవివాదంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొని,ఎంపీల నిరసనలతో సభ కార్యకలాపాలు అంతరాయంగా మారాయి.

    చివరికి సభ రేపు ఉదయానికి వాయిదా పడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జగదీప్ ధన్కర్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    జగదీప్ ధన్కర్

    Jadgeep Dhankhar: ఉప రాష్ట్రపతిని మిమిక్రీ చేయడం దురదృష్టకరం: ప్రధాని మోదీ  ఉప రాష్ట్రపతి
    Dhankhar: రాహుల్ గాంధీపై ఉపరాష్ట్రపతి ధన్కర్ మండిపాటు రాహుల్ గాంధీ
    Rajyasabha: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర కరెన్సీ నోట్లు.. సభ్యుల ఆందోళన  రాజ్యసభ
    Rajyasabha: రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025