
BSF: భారత్‌ను దెబ్బతీయాలన్న పాక్ ప్లాన్ ఫెయిల్.. లాంచ్‌ప్యాడ్‌ను ధ్వంసం చేసిన బీఎస్ఎఫ్
ఈ వార్తాకథనం ఏంటి
జమ్మూ సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) కీలక చర్య తీసుకుంది.
ఆక్నూర్ సెక్టార్‌కు ఎదరుగా ఉన్న పాక్ ఆధీనంలోని లూనీ ప్రాంతంలో ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కొనసాగుతున్న కాల్పుల నేపథ్యంలో, శుక్రవారం రాత్రి 9 గంటల తర్వాత పాక్ రేంజర్ల దాడికి బీఎస్ఎఫ్ సమర్థంగా ఎదురుదాడి జరిపినట్లు తెలిపారు.
పాక్ నుంచి బీఎస్ఎఫ్ పోస్టులపై తూటా దాడులు జరిగిన వెంటనే భారత బలగాలు కౌంటర్ ఫైరింగ్ ప్రారంభించాయి.
Details
ఉగ్రవాద స్థావరానికి భారీ నష్టం
తీవ్ర స్థాయిలో జరిపిన ఈ ప్రతీకార దాడిలో సియాల్‌కోట్ జిల్లాలో ఉన్న ఉగ్రవాద స్థావరానికి భారీ నష్టం జరిగింది.
అంతేకాకుండా పాక్ రేంజర్ల స్ధావరాలు కూడా ఈ కాల్పుల్లో తీవ్రంగా ప్రభావితమైనట్లు వెల్లడించారు.
భారత సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని, దేశ సరిహద్దుల్లో శాంతిని భంగం చేయాలనుకునే శత్రుదేశాలకు తగిన బుద్ధి చెప్పేందుకు వెనుకాడమని బీఎస్ఎఫ్ ప్రతినిధి తేల్చిచెప్పారు.