Page Loader
One year BEd: వన్‌ ఇయర్‌ బీఈడీ తిరిగి ప్రవేశపెట్టే అవకాశాలు.. పూర్తి వివరాలివే

One year BEd: వన్‌ ఇయర్‌ బీఈడీ తిరిగి ప్రవేశపెట్టే అవకాశాలు.. పూర్తి వివరాలివే

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 22, 2025
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) వన్‌ ఇయర్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) విధానాన్ని తిరిగి పునరుద్ధరించే అవకాశాలు చర్చించింది. ఈ సందర్భంగా ఎన్‌సీటీఈ మళ్లీ వన్‌ ఇయర్‌ బీఈడీ కోర్సును ప్రవేశపెట్టే దిశగా చర్చలు జరిపిందని ప్రకటన చేశారు. దశాబ్దకాలం క్రితం ఈ కోర్సు అమలులో ఉండగా, ఇప్పుడు నాలుగేళ్ల యూజీ లేదా రెండేళ్ల పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు వన్‌ ఇయర్‌ బీఈడీ విధానం వర్తిస్తుంది. అయితే మూడేళ్ల యూజీ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ కోర్సు వర్తించదు. వారు 2 సంవత్సరాల బీఈడీ ప్రోగ్రామ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Details

ఎనిమిదిమంది సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు

అదేవిధంగా 2028 నాటికి రెండు సంవత్సరాల బీఈడీని అందించే సంస్థలు మల్టీడిసిప్లినరీ ఇన్‌స్టిట్యూట్‌లుగా మారాలని ఎన్‌సీటీఈ చైర్మన్‌ పంకజ్‌ అరోరా తెలిపారు. అంతేకాక కొన్ని నిర్ణయాలపై కేంద్ర విద్యాశాఖతో చర్చలు జరుగుతున్నాయి. ఎన్‌సీటీఈ 'రూల్స్-2025' పేరుతో ఒక ముసాయిదా రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించాలని అనుకుంటోంది. వన్‌ ఇయర్‌ బీఈడీతో పాటు, ఇతర పలు కోర్సుల ఫ్రేమ్‌వర్క్‌ కోసం ఎనిమిది సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 2014 డిసెంబర్‌లో స్కూళ్లలో విద్యా నాణ్యతను పెంచాలనే ఉద్దేశంతో వన్‌ ఇయర్‌ బీఈడీ కోర్సును నిలిపివేయగా, తదుపరి ఏడాది నుండి రెండు సంవత్సరాల బీఈడీ కోర్సును ప్రవేశపెట్టారు.