Page Loader
Prajwal Revanna: మే 31 లోపు లొంగిపోతా :ఎంపీ ప్రజ్వల్ రేవన్న 
Prajwal Revanna: మే 31 లోపు లొంగిపోతా :ఎంపీ ప్రజ్వల్ రేవన్న

Prajwal Revanna: మే 31 లోపు లొంగిపోతా :ఎంపీ ప్రజ్వల్ రేవన్న 

వ్రాసిన వారు Stalin
May 27, 2024
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

వివాదాస్పద హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న కేసు ముగింపుకు వచ్చినట్లు కనిపిస్తోంది. మే 31లోపు ప్రత్యేక విచారణ బృందం (SIT) ముందు లొంగిపోతానని చెప్పారు. ఈ మేరకు ఓ ఇంగ్లీషు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఆయన ఉన్న సెక్స్ వీడియోలు బయటికి రావడంతో ప్రజ్వల్ తన దౌత్య పాస్ పోర్టుతో విదేశాలకు వెళ్లి పోయాడు. ఏప్రిల్ 26న విదేశాలకు పారిపోయినప్పటి నుంచి కాంగ్రెస్-జెడి ఎస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నెల 31 వ తేదీన 10 గంటలకు తాను SIT ముందు హాజరవుతానని చెప్పారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. తనను తప్పుగా అర్ధం చేసుకోవద్దని పార్టీ కార్యకర్తలను కోరారు.

Details 

రాజకీయ కుట్ర ఉందని ఆరోపణ 

న్యాయ వ్యవస్ధ పై తనకు సంపూర్ణ విశ్వాసం వుందని తెలిపారు. రాజకీయ కుట్రతో తనను తప్పుడు కేసులో ఇరికించారని వాపోయారు. ప్రజ్వల్ రేవన్న మాజీ ప్రధాని దేవెగౌడకు మనవడు అవుతారు. తాను ఇన్ని రోజులు ఎక్కడ వున్నది SIT అధికారులకు వివరిస్తానని తెలిపారు.