
పురుషుడికి గర్భం: ఆపరేషన్ చేసి ఆశ్చర్యపోయిన వైద్యులు
ఈ వార్తాకథనం ఏంటి
పురుషుడు గర్భం దాల్చడం ఏంటి? విడ్డూరంగా ఉంది కదా! మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన నిజంగా విడ్డూరమే.
అతని పేరు భగత్. ప్రస్తుతం ఆయన వయస్సు 60ఏళ్ళు. చిన్నప్పటి నుండి అతని కడుపు సాధారణ సైజు కంటే పెద్దగా ఉండేది. అతనెలా పెరుగుతూ వస్తున్నాడో కడుపు కూడా పెరుగుతూ వచ్చింది.
అతని కడుపును చూసిన చుట్టుపక్కల జనమంతా, ప్రెగ్నెంట్ మ్యాన్ అంటూ చులకనగా మాట్లాడటం మొదలెట్టారు.
అయితే 1999లో ఒకసారి అతడి కడుపు మరీ పెద్దదిగా మారడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారిపోయింది. దాంతో హాస్పిటల్ కు చేరుకున్నాడు భగత్.
భగత్ పొట్టను చూసిన వైద్యులు, అతని కడుపులో క్యాన్సర్ కణం పెరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేసారు.
Details
36ఏళ్ళ పాటు కడుపులోనే పిండం
తీరా ఆపరేషన్ చేసేసరికి వైద్యులను ఆశ్చర్యపరిచే విషయాలు తెలిసాయి. భగత్ కడుపులో పిండం ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ పిండానికి వెంట్రుకలు, దవడ కనిపించడంతో అందరూ షాకయ్యారు.
గత 36ఏళ్ళుగా ఆ పిండం, అతని కడుపులోనే పెరిగింది. ఈ పరిస్థితినిని ఫీటస్ ఇన్ ఫీటస్ అంటారని వైద్యులు వెల్లడిచేసారు. అంటే పిండంలోనే మరో పిండం పెరగడం.
నిజానికి భగత్ కడుపులో పెరిగిన పిండం, అతని కవల సోదరుడిదని వైద్యులు తెలియజేసారు. సర్జరీ జరిగిన తర్వాత భగత్ సాధారణంగా ఎలాంటి అనారోగ్యం లేకుండా గడుపుతున్నాడు.
ఈ విషయాన్ని ప్రముఖ పత్రిక ప్రస్తుతం ప్రచురించడంతో, మళ్ళీ వైరల్ గా మారింది.