తదుపరి వార్తా కథనం
Harish Rao: రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్: హరీశ్ రావు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 16, 2025
12:38 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
మాజీ సీఎం కేసీఆర్ పదేళ్లపాటు రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా మార్చి దేశానికి ఆదర్శంగా నిలిపారని హరీశ్ రావు కొనియాడారు.
అలాంటి నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్న జానా రెడ్డిని కేసీఆర్ గౌరవించారని గుర్తుచేశారు.
Details
సీఎం క్షమాపణ చెప్పాలి
సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననకు పాల్పడుతున్నారు. దీనిపై ఆయన క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు.
గతంలో కాంగ్రెస్ నేతలు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా అందిస్తామని చెప్పినా, అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.