NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Highcourt: ఎమ్మెల్యే ఆదిమూలంకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. కేసును కొట్టివేస్తూ తీర్పు
    తదుపరి వార్తా కథనం
    AP Highcourt: ఎమ్మెల్యే ఆదిమూలంకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. కేసును కొట్టివేస్తూ తీర్పు
    ఎమ్మెల్యే ఆదిమూలంకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. కేసును కొట్టివేస్తూ తీర్పు

    AP Highcourt: ఎమ్మెల్యే ఆదిమూలంకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. కేసును కొట్టివేస్తూ తీర్పు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 25, 2024
    11:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

    తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదిమూలంపై తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు.

    అయితే,ఈ కేసును కొట్టేయాలంటూ ఆదిమూలం హైకోర్టుకు దాఖలు చేసారు.

    తాజా విచారణలో, ఆయన తరఫున ఉన్న సీనియర్ న్యాయవాది సి.రఘు వాదిస్తూ,పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా అనవసరంగా కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.

    మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్‌పై ఆ మహిళ ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు.

    ఈ అంశాన్ని న్యాయవాది హనీట్రాప్ గా వర్ణించారు.అత్యాచారం సెక్షన్‌ను నమోదు చేయడం చెల్లదని,అందువల్ల ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని అభ్యర్థించారు.

    వివరాలు 

    ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలు అవాస్తవమని అఫిడవిట్‌

    ఈ క్రమంలో, బాధితురాలికి చెందిన న్యాయవాది కె. జితేందర్ కూడా వాదనలు వినిపించారు.

    బాధితురాలు స్వయంగా కోర్టుకు హాజరై, ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు,ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలు అవాస్తవమని అఫిడవిట్‌ను హైకోర్టులో దాఖలు చేశారు.

    ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని, ఎమ్మెల్యేపై కేసును కొట్టేయాలని కోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Andhrapradesh: ప్రాజెక్టుల నిర్వహణలపై నిర్లక్ష్యం - ఆర్థికశాఖ అభ్యంతరాలతో ప్రమాదంలో డ్యామ్'లు  ఆంధ్రప్రదేశ్
    Crude Oil : రూ.85వేల కోట్లతో క్రూడాయిల్ రవాణా నౌకల కొనుగోలుకి ప్రణాళిక ! చమురు
    AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు  ఆంధ్రప్రదేశ్
    Iran-Israel: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్: అమెరికా నిఘా వర్గాలు   ఇరాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025