
Sudheer Reddy: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎల్బీనగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
క్రైమ్ నంబర్ 254/2025 కింద, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారం ఈ కేసును నమోదు చేశారు.
ఈ వివాదం ప్రోటోకాల్ సమస్యతో ప్రారంభమైంది. మార్చి 12న, మన్సూరాబాద్ డివిజన్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Details
వివాదానికి కారణం
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించిన అభివృద్ధి పనులకు మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి తిరిగి శంకుస్థాపన చేశారు.
ఇది బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆగ్రహం కలిగించింది. వారు ఈ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అనంతరం అదే డివిజన్‌లో మరో ప్రాంతంలోనూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రయత్నించగా, బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి నిరసన తెలిపారు.
ఈ నిరసనల కారణంగా పోలీసులు రఘువీర్‌తో పాటు ఇతర కార్యకర్తలను అరెస్ట్ చేసి, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Details
ఎమ్మెల్యే కామెంట్స్ వివాదాస్పదం
అరెస్ట్ సమయంలో రఘువీర్ రెడ్డి సహా పలువురు కార్యకర్తలు స్వల్ప గాయాలపాలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వారిని పరామర్శించేందుకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
అక్కడ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై దాడుల వెనుక ఆయన హస్తం ఉందని పేర్కొన్నారు.
అలాగే బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహా రెడ్డి, వంగ మధుసూదన్ మధ్య అనుసంధానం నడుస్తోందని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా, హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్‌తోనూ సంబంధం కొనసాగుతోందని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Details
అట్రాసిటీ కేసు నమోదు
ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ కార్పొరేటర్ సుజాత నాయక్ తీవ్రంగా ఖండించారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణ అనంతరం కేసు నమోదు చేశారు.