Page Loader
Yogita Rana: విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా నియామకం ..
విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా నియామకం ..

Yogita Rana: విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా నియామకం ..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్‌ ఐఏఎస్ అధికారి యోగితా రాణాను నియమితులయ్యారు. 2003 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన యోగితా రాణా ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. విద్యాశాఖ సెక్రెటరీగా బుర్రా వెంకటేశం విధుల నుంచి తప్పుకున్నారు, ఈ విషయాన్ని గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఆయనను టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించడంతో, ఎన్‌ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. తాజాగా, యోగితా రాణాను సెక్రెటరీగా నియమించడంతో, శ్రీధర్‌ను విద్యాశాఖ నుంచి రిలీవ్‌ చేయడం జరిగింది. కాగా, ఎన్‌. శ్రీధర్‌కు గనుల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. అలాగే, 2006 బ్యాచ్‌కు చెందిన కే. సురేంద్ర మోహన్‌ను రవాణా శాఖ కమిషనర్‌గా నియమించారు.

వివరాలు 

రంపచోడవరం ఐటీడీఏ పీఓగా

ఈ నిర్ణయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీచేశారు. యోగితా రాణా 2003 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2002లో సివిల్‌ సర్వీసెస్‌లో మూడో ప్రయత్నంలో ఐఆర్‌టీఎస్‌కి ఎంపిక కాగా, 2003లో నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌కి ఎంపిక అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమె మొదట విశాఖ జిల్లాలో ఒక సంవత్సరం శిక్షణ తీసుకున్నారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్‌గా,రంపచోడవరం ఐటీడీఏ పీఓగా పనిచేశారు. యూఎన్‌డీపీలో మూడున్నరేళ్ళు పని చేసి, 2017లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 'ఈ-నామ్' కార్యక్రమంలో ఆయన మహత్తర పాత్ర పోషించి, ప్రధాని మోదీ చేతులమీదుగా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నారు.