Viral Video: ఆరేళ్ల మనవరాలితో రద్దీ రోడ్డుపై కారు నడిపించిన ఎస్సై.. కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదంటూ ప్రజల్లో అవగాహన కల్పించే పోలీసు శాఖకే చెందిన ఓ ఎస్సై, తన ఆరున్నరేళ్ల మనవరాలితో రద్దీగా ఉన్న రోడ్డుపై కారు నడిపించడంతో వివాదంలో చిక్కుకున్నారు. స్థానికులు అడ్డుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ సంఘటన శనివారం సాయంత్రం నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని గంధంగూడ ప్రాంతంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై పూజారి తిరుపతి తన కారు(టీఎస్07 జీపీ 7450)ను ఆరున్నరేళ్ల మనవరాలికి ఇచ్చి గంధంగూడ రోడ్డుపై డ్రైవింగ్ నేర్పించే ప్రయత్నం చేశారు.
వివరాలు
వాహనాన్ని ఆపించిన స్థానికులు
అదే సమయంలో రద్దీగా ఉండే రహదారిపై చిన్నారి కారు నడుపుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే వాహనాన్ని ఆపించి,ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన ఎస్సై, అది ఆటోమేటిక్ కారు కావడంతో వాహనంపై పూర్తి నియంత్రణ తన చేతిలోనే ఉందని చెప్పి వివరణ ఇచ్చినట్లు సమాచారం.
అయితే అక్కడే ఉన్న చిన్నారి తన తాత ఎస్సై అని చెప్పడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన కారణంగా కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
వివరాలు
ఎస్సైపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు
అక్కడే ఉన్న కొందరు స్థానికులు మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వేగంగా వైరల్‌గా మారింది.
వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ప్రజలకు సూచనలు చేసే పోలీసు శాఖకే చెందిన అధికారి నిబంధనలను ఉల్లంఘించడం సరికాదంటూ విమర్శలు వ్యక్తం చేశారు.
ఘటనపై స్పందించిన నార్సింగి పోలీసులు సంబంధిత ఎస్సైపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
అలాగే వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, సదరు ఎస్సైని సస్పెండ్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రద్దీ రహదారిపై చిన్నారితో కారు డ్రైవింగ్.. ఎస్సైపై కేసు, సస్పెన్షన్
A police officer reportedly let his young granddaughter drive car TS 07 GP 7450 on the busy Gandhamguda–Bairagiguda Road in Hyderabad, causing a traffic jam and safety concerns. When questioned, he allegedly defended the act.pic.twitter.com/cyWtZaWcZ6
— Monojit Sinha (@MonojitSinha11) July 13, 2026