LOADING...
Akhilesh Yadav: అఖిలేష్ ఫేస్‌బుక్ ఖాతా సస్పెన్షన్‌పై ఎస్పీ నేతల మండిపాటు
అఖిలేష్ ఫేస్‌బుక్ ఖాతా సస్పెన్షన్‌పై ఎస్పీ నేతల మండిపాటు

Akhilesh Yadav: అఖిలేష్ ఫేస్‌బుక్ ఖాతా సస్పెన్షన్‌పై ఎస్పీ నేతల మండిపాటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను సస్పెండ్ చేసినట్లు పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ తెలిపారు. ఆయన ఈ చర్యను ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఫక్రుల్ హసన్ చాంద్ ఎక్స్ (Twitter)లో రాసినట్లు, ''దేశంలో మూడవ అతిపెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడైన అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి. బీజేపీ ప్రభుత్వం దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించింది. ప్రతిపక్షంలోని ప్రతి గొంతును అణచివేయాలని చూస్తోందన్నారు. ఖాతాను పునరుద్ధరించకపోతే, పార్టీ చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

Details

 లైంగిక కంటెంట్‌ను పోస్ట్ చేసినందున బ్లాక్ 

ఫేస్‌బుక్ అఖిలేష్ ఖాతాను హింసాత్మక, లైంగిక కంటెంట్‌ను పోస్ట్ చేసినందున బ్లాక్ చేసినట్లు సమాచారం. అఖిలేష్ యాదవ్ ఖాతాలో 8 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నారు. ఈ ఖాతాను శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సస్పెండ్ చేసినట్లు తెలిసింది. పార్టీ నేతలు ఖాతా క్లోజ్ చేయడంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేషనల్ అధ్యక్షుడిగా ఉన్న అఖిలేష్ ఖాతాను క్లోజ్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు దెబ్బతీస్తుందని జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ పేర్కొన్నారు. బీజేపీ ఇలా చేస్తే అది తప్పు అని, అధికార పార్టీ ఆదేశం మేరకు ఇది జరిగితే పిరికితనానికి సంకేతమని అన్నారు.

Details

ఫేస్‌బుక్ తన పరిమితులను దాటింది

అలాగే, ఎటువంటి హెచ్చరిక లేదా నోటీసు లేకుండా ఖాతాను ఎలా క్లోజ్ చేయగలరో లక్నో నార్త్ నుంచి ఎంపీ పూజా శుక్లా ప్రశ్నించారు. ఫేస్‌బుక్ తన పరిమితులను దాటిందని మండిపడ్డారు. 'అఖిలేష్ యాదవ్ లక్షలాది మంది అనుచరులు కలిగిన గొంతుక! ఫేస్‌బుక్ తన సరిహద్దులను గుర్తుంచుకోవాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని నిశ్శబ్దం చేయకూడదు. సమాజ్‌వాదీలారా.. ఫేస్‌బుక్‌ను దాని పరిధిని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని శుక్లా తెలిపారు.