LOADING...
Special TET: సర్వీసులోని ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సర్వీసులోని ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Special TET: సర్వీసులోని ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 09, 2026
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా నిర్వహించే రెగ్యులర్ టెట్‌తో పాటు, సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రంలో 2011 సంవత్సరానికి ముందు ఉపాధ్యాయ ఉద్యోగాల్లో చేరి, కనీసం ఐదేళ్లకు పైగా సేవలందిస్తున్న వారు 2028 ఆగస్టు 31లోపు తప్పనిసరిగా టెట్ అర్హతను పొందాల్సి ఉంటుంది.

వివరాలు

టెట్ నిర్వహణకు ఆమోదం..

ఇటీవల కొన్ని నెలలుగా ఉపాధ్యాయ సంఘాలు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకునే వరకు, వారికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక టెట్ నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక టెట్ నిర్వహణకు ఆమోదం తెలుపుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశాయి.

Advertisement