Liquor Sales: మందు బాబులకు సూపర్ న్యూస్.. డిసెంబర్ 31న అమ్మకాల వేళలు పొడిగింపు!
ఈ వార్తాకథనం ఏంటి
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఈ నెల 31న రాష్ట్రంలో మద్యం అమ్మకాల వేళలను ప్రభుత్వం పొడిగించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 31వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు అన్ని బార్‌లు, రెస్టారెంట్లు, ఈవెంట్‌లు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హోటళ్లలో మద్యం విక్రయానికి అనుమతి ఇచ్చారు.
అదేవిధంగా అన్ని వైన్ షాపులను ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నూతన సంవత్సరం సంబరాల్లో డ్రగ్స్ వాడకం, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యం అమ్మకాలను నిరోధించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.
Details
వేడుకల్లో ప్రత్యేక నిఘా ఉంచాలి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే వేడుకలు, పార్టీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.
జిల్లా అధికారులతో ఇటీవల జరిగిన సమావేశంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్సైజ్ సిబ్బంది అన్ని రకాల నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.