SwathiMaliwal: ఆప్ ను వెంటాడుతున్న స్వాతి మలాల్ దుమారం?
ఈ వార్తాకథనం ఏంటి
ఆప్ లో స్వాతి మలాల్ దుమారం ఇప్పటితో ముగిసేలా కనిపించడం లేదు. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది.
తనపై అత్యాచారం చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు.దీని వెనుక ఆప్ పెద్దల హస్తం వుందన్నారు.
తన ప్రాణాకు ముప్పు వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సాక్ష్యంగా యూట్యూబర్ ధ్రువ్ రాధీ విడుదల చేసిన వీడియోను స్వాతి చూపారు.
ధ్రువ్ రాధీతో మాట్లాడటానికి తాను చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదన్నారు. ఈ మేరకు ఆమె తన X (ట్విట్టర్ )లో ఓ పోస్ట్ చేశారు.
Details
ధ్రువ్ రాధీ.. వీడియో బెదిరించడానికే
తమ పార్టీ నేతలపై తాను చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోమని వత్తిడి తెస్తున్నారన్నారు.
వీటిలో భాగంగానే ఇటువంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు.
ధ్రువ్ రాధీ వీడియో ఏక పక్షంగా ఉందని తెలిపారు. తనను లక్ష్యం చేసుకుని వీడియో రూపొందించారని అభిప్రాయ పడ్డారు.
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయిన తనకే ఇటువంటి పరిస్ధితి రావడం బాధాకరమన్నారు. తాను ఆప్ అధికారిక ప్రతినిధిగా వున్నానని గుర్తు చేశారు. ఇంత కంటే దారుణం మరొకటి ఉండదన్నారు.