AP teacher Suspend: వాట్సాప్ ఫోన్ చూడనందుకు.. ఓ మాస్టారు సస్పెండ్
వాట్సాప్ చూడటం లేదని ఓ టీచర్ ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్కూల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని మరో కారణం చెప్పారు. ఈ ఉత్తర్వులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయవాడలోని మొగల్రాజపురంలో బీఎస్ఆర్కే మున్సిపల్ హైస్కూల్‌లో పని చేస్తున్నఎల్ రమేష్ అనే ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో విద్యాశాఖాధికారి చెప్పిన ప్రధాన కారణం... ఆ ఉపాధ్యాయుడు ఎల్ రమేష్ వాట్సాప్ చూడటం లేదట. అంతే కాదు స్కూల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారట. స్కూల్ గ్రూపు నుంచి ఎగ్జిట్ అయి.. వాట్సాప్ చూడకపోవడం వల్ల...ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలను ఆయన మిస్ అవుతున్నారని అంటున్నారు.
బాధ్యతారాహిత్యంగా ఉన్నందుకు సస్పెండ్
ఆయనతో కమ్యూనికేట్ చేయడం కష్టంగా ఉందని..చెబుతున్నారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని మొగల్రాజ పురంలో జరిగింది. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ ఉన్నతాధికారి (DEO) ఆదేశాలు జారీ చేశారు. రమేష్ అనే మాస్టారు విధుల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంగా ఉన్నందుకు సస్పెండ్ చేశామని ఓ ప్రకటనలో తెలిపారు. ఐతే రమేష్ వాదన మరోలా వుంది. తనను వాట్సాప్ ఫోన్ చూడవద్దని కంటి డాక్టర్ సూచించారన్నారు. అయితే ఇందుకు తగిన ఆధారాలను ఆయన సమర్పించలేకపోయారు.