ఎన్‌టీఆర్ జిల్లా: వార్తలు

సోషల్ మీడియాలో బెజవాడ దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు.. చిత్రీకరించింది ఎవరో తెలుసా?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అమ్మవారు మూల విరాట్టు వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు దుర్గ గుడి ఈవో భ్రమరాంబ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె విచారణకు ఆదేశించారు.