Telangana Budget: తెలంగాణ బడ్జెట్ @ రూ.2,75,891 కోట్లు.. ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు
Telangana Budget 2024: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ పద్దును ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ఈ బడ్జెట్‌లో దృష్టి సారించింది. శాసన మండలిలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రెవెన్యూ వ్యయం- రూ.2,01,178 కోట్లు మూలధన వ్యయం- రూ.29,669 కోట్లు ఆరు గ్యారంటీలు - రూ.53,196 కోట్లు వ్యవసాయ రంగం- రూ.19,746 కోట్లు పురపాలక శాఖ - రూ.11,692 కోట్లు
అధిక ద్రవ్యోల్భణంలో తెలంగాణ ఐదో స్థానం
పంచాయతీరాజ్ శాఖ- రూ.40,080 కోట్లు విద్యా రంగం - రూ.21,389 కోట్లు నీటి పారుదల శాఖ- రూ.28,024 కోట్లు బీసీ సంక్షేమం - రూ.8,000 కోట్లు వైద్య రంగానికి రూ.11,500 కోట్లు గృహనిర్మాణానికి రూ.7,740 కోట్లు మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు ఐటీ శాఖ - రూ.774 కోట్లు 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 14.7 శాతం నుంచి 11.3 శాతానికి క్షీణించినట్లు మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో సైతం వృద్ధి రేటు 16.1 శాతం నుంచి 8.9 శాతానికి క్షీణించినట్లు వెల్లడించారు. ఇక అధిక ద్రవ్యోల్భణానికి వస్తే.. తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నట్లు వివరించారు.