Page Loader
Telangana results: తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. అశ్వారావుపేట, ఇల్లెందులో కాంగ్రెస్ విజయం
Telangana results: తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. అశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం

Telangana results: తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. అశ్వారావుపేట, ఇల్లెందులో కాంగ్రెస్ విజయం

వ్రాసిన వారు Stalin
Dec 03, 2023
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెల్లడైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లెందులో కాంగ్రెస్ విజయం సాధించింది. అశ్వారావుపేటలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆదినారాయణ, బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 28 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2018లో టీడీపీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ నుంచి గెలిచి, బీఆర్ఎస్‌లో చేరారు. ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య 38వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇదిలా ఉంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీని కనబరుస్తోంది. మొత్తం పదికి 10 స్థానాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షం సీపీఐ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మెచ్చాపై ఆదినారాయణ విజయం