'సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదం: కేసీఆర్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
తమ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదంతోనే తమ ప్రభుత్వం ముందుకుసాగుతోందని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తొలుత గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ
తెలంగాణ ప్రథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు
తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు బెంచ్ మార్క్‌గా నిలిచిందని కేసీఆర్ స్పష్టం చేశారు.
అతి తక్కువ వ్యవధిలో సంక్షేమ పాలన అందించి అద్భతమైన ఫలితాలను సాధించినట్లు చెప్పారు.
రాష్ట్రాన్ని దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఇంత ప్రగతి కేవలం ఆరేళ్లలోనే సాధించామని, కరోనా వల్ల మిగతా మూడేళ్లలో ఆశించినంత పురగోతి సాధించినలేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందినట్లు కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని కేసీఆర్ అన్నారు. దేశంలోనే మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన మంచి నీరు అందిస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు.
తెలంగాణ
1.5 లక్షల మంది గిరిజనులకు పోడు పట్టాలు
తెలంగాణ ప్రభుత్వం జూన్ 24 నుంచి 1.5 లక్షల మంది గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల 'పోడు' భూమి పట్టాలను పంపిణీ చేస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు.
ఈ పదేళ్ల కాలం సాగునీటి రంగానికి స్వర్ణయుగమన్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుల ఒక అద్భుతం అన్నారు.
దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు దళిత బంధును తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం 9 ఏళ్లలో రూ.1.24 లక్షల నుంచి రూ.3.17 లక్షలకు పెరిగిందన్నారు కేసీఆర్.
రాష్ట్ర జీఎస్‌డీపీ 2014లో రూ.5.06 లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.13 లక్షల కోట్లకు చేరిందని స్పష్టం చేశారు.
EMBED
అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు.#తెలంగాణదశాబ్దిఉత్సవాలు#TelanganaTurns10 #TelanganaFormationDay pic.twitter.com/zV93Sk6iZ0— Telangana CMO (@TelanganaCMO) June 2, 2023