NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Future City: 'ఫ్యూచర్‌ సిటీ' కోసం ప్రత్యేకంగా 'ఎఫ్‌సీడీఏ' ఏర్పాటు.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Future City: 'ఫ్యూచర్‌ సిటీ' కోసం ప్రత్యేకంగా 'ఎఫ్‌సీడీఏ' ఏర్పాటు.. 
    'ఫ్యూచర్‌ సిటీ' కోసం ప్రత్యేకంగా 'ఎఫ్‌సీడీఏ' ఏర్పాటు..

    Future City: 'ఫ్యూచర్‌ సిటీ' కోసం ప్రత్యేకంగా 'ఎఫ్‌సీడీఏ' ఏర్పాటు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 13, 2025
    08:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే 'ఫ్యూచర్‌ సిటీ' కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)అనే కొత్త సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

    రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాల్లో 56 రెవెన్యూ గ్రామాలను ఈ సంస్థ పరిధిలోకి తీసుకువచ్చారు.

    ఈ అథారిటీలో ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా,పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ/ పరిశ్రమలు,ఐటీ వాణిజ్య శాఖ మంత్రి వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

    అంతేకాక,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పర్యావరణ & అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్, టీజీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైదరాబాద్‌ డీటీసీపీ సభ్యులుగా ఉంటారు.

    అథారిటీ కమిషనర్ మెంబర్‌ సెక్రటరీగా నియమితుడవుతారు.

    వివరాలు 

    ఫ్యూచర్‌ సిటీ ఏరియా మొత్తం 765.28 చదరపు కీ.మీ 

    ఈ మేరకు పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

    ఓఆర్‌ఆర్‌ (ఔటర్ రింగ్ రోడ్) పరిధికి బయట ఉన్న ప్రాంతాలు,ముఖ్యంగా శ్రీశైలం జాతీయ రహదారి - నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారి మధ్య ప్రాంతాలను ఫ్యూచర్‌ సిటీ పరిధిలోకి చేర్చారు.

    విమానాశ్రయం,పారిశ్రామిక,మౌలిక సదుపాయాల కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలను ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు.

    ఫ్యూచర్‌ సిటీ ఏరియా మొత్తం 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.దీని అభివృద్ధి కోసం ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఫ్యూచర్‌ సిటీ పరిధిలోకి వచ్చే 36 గ్రామాలు ముందుగా హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండేవి. వీటిని ఇప్పుడు ఎఫ్‌సీడీఏకి బదిలీ చేశారు.

    వివరాలు 

    ఫ్యూచర్‌ సిటీ పరిధిలోకి వచ్చిన గ్రామాలు ఇవే 

    మొత్తంగా 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలు ఈ అథారిటీ పరిధిలోకి చేరాయి. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

    అమన్‌గల్‌ మండలం: 1. కోనాపూర్‌ 2. రామనూతుల; ఇబ్రహీంపట్నం మండలం: 3. కప్పపహాడ్‌ 4. పోచారం 5. రామ్‌రెడ్డిగూడ 6. తులేకలాన్‌ 7. తుర్కగూడ 8. ఎలిమినేడు 9. ఎర్రకుంట 10. తడ్లకల్వ; కడ్తాల్‌ మండలం: 11. చెర్లికొండపట్టి కల్వకుర్తి 12. చెర్లికొండపట్టి పడ్కల్‌ 13. ఏక్‌రాజ్‌గూడ 14. కడ్తాల్‌ 15. కర్కాల్‌ పహాడ్‌ 16. ముద్విన్‌; కందుకూరు మండలం: 17. దాసర్లపల్లి 18. అన్నోజిగూడ 19. దెబ్బడగూడ 20. గూడూర్‌ 21. గుమ్మడవల్లె 22. కందుకూరు 23. కొత్తూర్‌ 24. గఫూర్‌నగర్‌ 25. లేమూర్‌ 26. మాదాపూర్‌

    వివరాలు 

    ఫ్యూచర్‌ సిటీ పరిధిలోకి వచ్చిన గ్రామాలు ఇవే 

    27. మీర్‌ఖాన్‌పేట 28. మొహమ్మద్‌ నగర్‌ 29. ముచ్చర్ల 30. పంజాగూడ 31. రాచలూర్‌ 32. సర్వరావులపల్లె 33. తిమ్మాయిపల్లె 34. తిమ్మాపూర్‌; మహేశ్వరం మండలం: 35. మొహబ్బత్‌నగర్‌ 36. తుమ్మలూర్‌; మంచాల మండలం: 37. ఆగపల్లి 38. నోముల 39. మల్లికార్జునగూడ; యాచారం మండలం: 40. చౌదరిపల్లి 41. గున్‌గల్‌ 42. కొత్తపల్లి 43. కుర్మిద్ద 44. మేడిపల్లి 45. మల్కాజిగూడ 46. మొగుళ్లవంపు 47. నక్కర్త 48. నానక్‌నగర్‌ 49. నంది వనపర్తి 50. నజ్దిక్‌ సింగారం 51. తక్కెళ్లపల్లి 52. తాటిపర్తి 53 తులేఖుర్ద్‌ 54. యాచారం 55. చింతపట్ల 56. నల్లవెల్లి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత! విజయవాడ వెస్ట్
    Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం  ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్

    తెలంగాణ

    TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు రంగం సిద్ధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!  ఇండియా
    SLBC Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్.. కార్మికుల రక్షణ కోసం విచారణ హైకోర్టు
    TG Govt: తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
    Inter Exams: ఇంటర్ బోర్డు నూతన నిబంధన.. ఈసారి అలస్యమైనా అవకాశం ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025