డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు
ఈ వార్తాకథనం ఏంటి
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ కె.రాజేంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
రాయదుర్గం పోలీసులు ఎస్సై రాజేంద్రను కస్టడీలోకి తీసుకొని, కూకట్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో కోర్టు రెండు రోజుల పాటు అతనికి పోలీస్ కస్టడీకి విధించింది.
ఎస్సై రాజేంద్రకు డ్రగ్స్ ముఠాలకు సంబంధం ఉండొచ్చన్న ఆరోపణల మేరకు, ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రాజేంద్ర ఇంటి నుంచి 1,775 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.
ఈ ఘటనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐపై కేసు నమోదైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉత్తర్వులు జారీ చేసిన సీపీ స్టీఫెన్ రవీంద్ర
SI Rajender Suspended In Raidurgam Drugs Case#SIRajender #Raidurgam #DrugsCase #NTVTelugu #NTVNews pic.twitter.com/zlMC3MSS7f
— NTV Telugu (@NtvTeluguLive) September 6, 2023