పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు
దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. రాహుల్ సాధారణ సాధారణ పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవడానికి మూడేళ్లపాటు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఓసి) మంజూరు చేసింది. మార్చి 26న లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తన దౌత్య పాస్‌పోర్ట్‌తో పాటు ఇతర రవాణా పత్రాలను రాహుల్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. త్వరలో రాహుల్ అమెరికాకు వెళ్లనుండటంతో వీఐపీ హోదాలో పాస్ పోర్టు పొందే అవకాశం లేకపోవడంతో, సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తున్న చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ క్రిమినల్ విచారణ ఎదుర్కొంటున్ననేపథ్యంలో అతనికి ఎన్‌ఓసీ అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.