Page Loader
AP Inter Results: రేపే ఇంటర్ ఫలితాలు.. ఒక్క మెసేజ్‌తో ఫలితాలు మీ ఫోన్‌లోకి! 
రేపే ఇంటర్ ఫలితాలు.. ఒక్క మెసేజ్‌తో ఫలితాలు మీ ఫోన్‌లోకి!

AP Inter Results: రేపే ఇంటర్ ఫలితాలు.. ఒక్క మెసేజ్‌తో ఫలితాలు మీ ఫోన్‌లోకి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2025
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు సులభంగా ఫలితాలు అందేలా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం కల్పించింది. ఇందుకోసం 95523 00009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపితే ఫలితాలు మీ మొబైల్‌కి వస్తాయని మంత్రి తెలిపారు.

Details

ఫలితాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి

అలాగే, ఫలితాలను తెలుసుకునేందుకు APResults.bie.gov.in, resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లను కూడా వినియోగించవచ్చు. అంతేకాకుండా మనం మిత్ర యాప్ ద్వారానే కూడా విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం ఫలితాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్వీట్ చేసిన నారా లోకేశ్