LOADING...
Helicopter Crashes: విమాన ప్రమాదంలో మరణించిన భారత నాయకులు వీరే.. 

Helicopter Crashes: విమాన ప్రమాదంలో మరణించిన భారత నాయకులు వీరే.. 

వ్రాసిన వారు Stalin
May 20, 2024
06:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన వార్తతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. దీంతో హెలికాప్టర్‌ ప్రమాదాలపై మరోసారి చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇప్పటివరకు భారతదేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన హెలికాప్టర్‌ ప్రమాదాలేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో రుద్రకొండ హిల్స్‌లో విమానం కూలి దాదాపు 24 గంటల పాటు కనిపించకుండా పోయారు.ఆయన మరణానంతరం కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారసత్వాన్ని స్వీకరించి 2019లో ఆంధ్రాకు ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి మార్చి 3, 2002న చాపర్ ప్రమాదంలో మరణించారు. అయన బెల్ 206 హెలికాప్టర్ శకలాలు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కైకలూరు ప్రాంతంలో కనుగొన్నారు.

Details 

విమానం కూలి సంజయ్ గాంధీ మృతి 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాధవరావు సింధియా 2001లో ప్రైవేట్ విమాన ప్రమాదంలో మరణించారు.అయన కాన్పూర్ నుండి వస్తుండగా,మెయిన్‌పురి జిల్లా శివార్లలో విమానం కూలిపోయింది. పంజాబ్ మాజీ గవర్నర్ సురేంద్ర నాథ్ 1994లో విమాన ప్రమాదంలో మరణించారు.ఈ విమానంలో అయన కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు, రాజీవ్ గాంధీ తమ్ముడు సంజయ్ గాంధీ 23 జూన్ 1980న ఢిల్లీలో మరణించారు. విమానం నడుపుతూ విన్యాసాలు చేస్తుండగా, అది కూలిపోయింది. ఈ విమానంలో అతని కో-పైలట్ కెప్టెన్ సుభాష్ సక్సేనా కూడా ఉన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ హఠాన్మరణం చెందారు.