Page Loader
Telangana: తెలంగాణలో మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం
Telangana: తెలంగాణలో మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం

Telangana: తెలంగాణలో మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం

వ్రాసిన వారు Stalin
Feb 14, 2024
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో అధికారుల బదిలీల పరంపరం కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికారులను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలను చేపట్టింది. మంగళవారం 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసిన ప్రభుత్వం.. బుధవారం మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లను సర్కార్ ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అలాగే, పంచాయతీరాజ్ శాఖలోనూ 105 మంది సీఈవో, డీఆర్‌డీవో, అదనపు డీఆర్‌డీవో, డీపీవోలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు ఎక్సైజ్ శాఖలో 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లను కూడా బదిలీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం