LOADING...
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు 
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు 

వ్రాసిన వారు Stalin
Jul 25, 2023
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వనమా సమీప ప్రత్యర్థి జలగం వెంకట్‌రావు‌ను కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎన్నికైనట్లు తీర్పు చెప్పింది. ఫారం 26లో తన ప్రత్యర్థి వనమా వెంకటేశ్వర‌రావు తనకు, తన భార్యకు సంబంధించిన పూర్తి ఆస్తి వివరాలను ఎన్నికల సంఘానికి ఇవ్వలేదని జలగం వెంకట్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 2019 జనవరిలో జలగం వెంకట్‌రావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో జలగం వెంకట్‌రావుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఆయన తరఫు న్యాయవాది రమేష్ తెలిపారు. అలాగే వెంకటేశ్వర రావుకు రూ.5 లక్షల జరిమానా కూడా హైకోర్టు విధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు ఎన్నికైనట్లు హైకోర్టు ఉత్తర్వులు