NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vijayanand: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా విజయానంద్‌
    తదుపరి వార్తా కథనం
    Vijayanand: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా విజయానంద్‌
    ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా విజయానంద్‌

    Vijayanand: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా విజయానంద్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 30, 2024
    08:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్‌ నియమితులయ్యారు.

    1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    ప్రస్తుతం ఆయన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.

    ప్రస్తుత సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో విజయానంద్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

    వైఎస్సార్‌ జిల్లాలోని రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె గ్రామం విజయానంద్‌ స్వస్థలం.

    ఆయన మొదటి పోస్టింగ్‌ ఆదిలాబాద్‌ జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు.

    వివరాలు 

    ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీగా విజయానంద్‌

    విజయానంద్‌ ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీగా సుదీర్ఘకాలం పాటు సేవలు అందించారు.

    అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)గా కూడా ఆయన పని చేశారు.

    2025 నవంబర్‌లో విజయానంద్‌ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ను సీఎస్‌గా నియమించే అవకాశం ఉంది.

    సాయిప్రసాద్‌ 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి, ఆయనకు 2026 ఏప్రిల్‌ వరకూ సేవల అవకాశం ఉంది.

    సీనియారిటీ పరంగా సాయిప్రసాద్‌ ముందు ఉన్నప్పటికీ, విజయానంద్‌ రిటైర్మెంట్‌ సమయానికి ఆయన పదవీ కాలం ముగియడంతో, ప్రభుత్వం ప్రస్తుతం విజయానంద్‌ను సీఎస్‌గా నియమించడమే సముచితం అని నిర్ణయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    Rajya Sabha : ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం  రాజ్యసభ
    Andhrapradesh: జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి.. జిల్లా అధికారులకు ఆదేశాల జారీ భారతదేశం
    Paper Leak: సమ్మెటివ్‌-1 పరీక్షల గణిత ప్రశ్నపత్రాలు లీక్‌.. 6-10 తరగతుల గణిత పరీక్షలు రద్దు భారతదేశం
    AP Liquor Bar Auctions : ఏపీలో 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025