LOADING...
Ashwini Vaishnav: హైదరాబాద్‌-చెన్నై-బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైలు సేవలు.. కీలక ప్రకటన చేసిన అశ్వినీ వైష్ణవ్
హైదరాబాద్‌-చెన్నై-బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైలు సేవలు.. కీలక ప్రకటన చేసిన అశ్వినీ వైష్ణవ్

Ashwini Vaishnav: హైదరాబాద్‌-చెన్నై-బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైలు సేవలు.. కీలక ప్రకటన చేసిన అశ్వినీ వైష్ణవ్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 12, 2026
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో రైల్వే రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతంతో పోలిస్తే గణనీయంగా అధిక నిధులు కేటాయిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన 'వికసిత్‌ భారత్‌-2047: సాంకేతికత పాత్ర' సదస్సులో కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన పలు కీలక అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అశ్వినీ వైష్ణవ్‌, హైదరాబాద్‌ను చెన్నై, బెంగళూరుతో అనుసంధానించే బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులను అమలు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే మూడు ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన రైలు రవాణా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

వివరాలు

ఏపీకి రూ.880 కోట్ల రైల్వే బడ్జెట్..

రైల్వే బడ్జెట్‌ కేటాయింపులపై మాట్లాడిన ఆయన, యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.880 కోట్ల రైల్వే బడ్జెట్‌ మాత్రమే కేటాయించబడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికే సుమారు రూ.5 వేల కోట్ల మేర వ్యయం చేస్తోందని వెల్లడించారు.

వివరాలు

40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 1,300 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే కార్యక్రమం కొనసాగుతోందని, అందులో ఇప్పటికే 260 స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ ఆధునికీకరణ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేసినట్లు అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Advertisement