Visakhapatnam: విశాఖలో భూకంప ప్రకంపనలు.. పలుచోట్ల స్వల్పంగా కంపించిన నేల
వ్రాసిన వారు
Moogati Shabari
Jul 12, 2026
11:29 am
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. ఉదయం 5.08 గంటల సమయంలో గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవ, ఎంవీపీ అప్పుఘర్ తదితర ప్రాంతాల్లో నివాసితులు భూమి స్వల్పంగా కంపించినట్లు గుర్తించారు.
వివరాలు
రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రత నమోదు..
అధికారుల వివరాల ప్రకారం, ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో నమోదైంది. భూకంప కేంద్రం కాకినాడకు సుమారు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో, భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.