తదుపరి వార్తా కథనం
Narsapuram Lace: నరసాపురం లేస్‌కు భౌగోళిక సూచిక ధ్రువీకరణ పత్రం
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 26, 2024
11:04 am
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లేస్‌కు భౌగోళిక సూచిక (జీఐ) గుర్తింపు లభించింది.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేనేత ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ సహకారంతో దిల్లీలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉత్పత్తుల ప్రోత్సాహం, మార్కెట్ లింకేజీ, బ్రాండింగ్ ప్రమోషన్ వంటి అంశాలపై అంతర్జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు.
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర చేనేత, జౌళి సంక్షేమ శాఖ కమిషనర్ రేఖారాణి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జీఐ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు.