Loading...
Shashi Tharoor: 'క్వాకర్‌వోడ్జర్‌' అంటే ఏంటో తెలుసా? శశి థరూర్‌ పోస్ట్‌తో చర్చ
'క్వాకర్‌వోడ్జర్‌' అంటే ఏంటో తెలుసా? శశి థరూర్‌ పోస్ట్‌తో చర్చ

Shashi Tharoor: 'క్వాకర్‌వోడ్జర్‌' అంటే ఏంటో తెలుసా? శశి థరూర్‌ పోస్ట్‌తో చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మరోసారి తన క్లిష్టమైన ఆంగ్ల పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో చర్చకు తెరలేపారు. తాజాగా ఆయన ఎక్స్‌ (X) వేదికగా 'క్వాకర్‌వోడ్జర్‌' (Quockerwodger) అనే పదాన్ని ఉపయోగిస్తూ ఓ పోస్టు చేశారు. ఈ పదానికి 'ఇతరుల నియంత్రణలో ఉండే రాజకీయ నాయకుడు', 'ఇతరుల ఆదేశాల మేరకు పనిచేసే రాజకీయ కీలుబొమ్మ'(Political Puppet)అనే అర్థం ఉందని వివరించారు. గత 12ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి కొందరు రాజకీయ నాయకులను తయారు చేసిందని థరూర్‌ తన పోస్టులో వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి 'క్వాకర్‌వోడ్జర్‌'అనే పదాన్ని ఉపయోగించారన్న దానిపై సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో థరూర్‌ ఉపయోగించిన పదం మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

వివరాలు 

2022లోనూ ఇదే పదం..

అయితే 'క్వాకర్‌వోడ్జర్‌' అనే పదాన్ని శశి థరూర్‌ ఇప్పుడు తొలిసారి ఉపయోగించలేదు. 2022 ఏప్రిల్‌లోనూ ఇదే పదాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

అప్పట్లోనూ ఈ పదానికి సంబంధించిన అర్థంపై నెటిజన్లు ఆసక్తి చూపించారు.

వివరాలు 

గతంలోనూ ఎన్నో క్లిష్టమైన పదాలు..

శశి థరూర్‌ రాజకీయ వ్యాఖ్యల్లో అరుదైన, క్లిష్టమైన ఆంగ్ల పదాలను ఉపయోగించడం కొత్తేమీ కాదు.

గతంలోనూ ఆయన ఇలాంటి అనేక పదాలను సామాజిక మాధ్యమాల్లో ఉపయోగించారు. వాటిలో 'అలోడాక్సాఫోబియా' (Allodoxaphobia) కూడా ఒకటి.

ఈ పదానికి ఇతరుల ముందు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంపై తీవ్ర భయం అనే అర్థాన్ని ఆయన వివరించారు.

థరూర్‌ ఇలాంటి క్లిష్టమైన పదాలను ఉపయోగించిన ప్రతిసారీ వాటి అర్థాలను తెలుసుకునేందుకు నెటిజన్లు నిఘంటువులను ఆశ్రయిస్తున్నారు.

రాజకీయ అంశాలను అరుదైన, క్లిష్టమైన ఆంగ్ల పదజాలంతో ప్రస్తావించడం శశి థరూర్‌ ప్రత్యేకతగా కొనసాగుతోంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్లిష్టమైన ఆంగ్ల పదంతో శశి థరూర్‌ పోస్ట్‌.. 'క్వాకర్‌వోడ్జర్‌' అంటే?

ADVERTISEMENT