#123123: 2023లో లాస్ట్ డే.. వందేళ్లకోసారి వచ్చే ఈ రోజు ప్రాముఖ్యత గురించి తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
2023లో చివరి రోజు గురించి గూగుల్ చాలా ప్రత్యేకమైన పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో నేటి తేదీ అంటే 31 డిసెంబర్ 2023 ప్రాముఖ్యతను తెలియజేసింది.
100 ఏళ్ల తర్వాత ఇలాంటి ప్రత్యేకమైన తేదీ వచ్చినట్లు గూగుల్ పేర్కొంది.
న్యూమరాలజీ పరంగానే కాకుండా, ఆధ్యాత్మకంగా కూడా 12/31/2023 తేదీ చాలా ప్రత్యేకమైనది నిపుణులు కూడా చెబుతున్నారు.
ఇంతటి ప్రాధాన్యత ఉన్న తేదీ.. 1923 తర్వాత అంటే వందేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చింది.
12/31/2023 తేదీని న్యూమరాజీ పరంగా '123123' చూస్తారు.
'123123' సంఖ్య అనేది మిమ్మల్ని కొత్తగా ప్రారంభించడం గురించి ఆలోచించేలా చేస్తుంది.
ఈ ఆరు అంకెలను గమనిస్తే.. 123 తర్వాత 123 వస్తుంది. ఇది కొత్త ప్రారంభాల సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
న్యూ ఇయర్
6 సంఖ్య న్యూమరాలజీలో పురోగతి, సమతుల్యతకు సంకేతం
123123 సంఖ్యలు ఆధ్యాత్మికంగా నమ్మే వారికి లేదా సంఖ్యాశాస్త్రాన్ని విశ్వసించే వారికి చాలా ప్రత్యేకమైనదని జ్యోతిష్కుడు జగన్నాథ్ గురూజీ చెబుతున్నారు.
ఈ అరుదైన సంఘటన శక్తిని కలిగి ఉంటుందని ఆయన అంటున్నారు. కొత్త ప్రారంభాలతో ముడిపడి ఉన్న ఒకే నంబర్ రెండు సార్లు కనిపించడం అరుదని ఆయన అభిప్రాయప్డడారు.
ఇలాంటి అంకెలను దేవదూత సంఖ్యలుగా భావిస్తారు. ఇలాంటి సంఖ్యలను విశ్వం నుంచి వచ్చే సంకేతాలుగా చెబుతుంటారు.
1 + 2 + 3ని కలిపితే 6 వస్తుంది. ఆరు అనేది న్యూమరాలజీలో పురోగతి, సమతుల్యత, ప్రేమను సూచిస్తుంది.
కాబట్టి 12/31/23న ఈ సానుకూల లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.