అక్షయ తృతీయ 2023: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి
ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22వ తేదీన జరుపుకుంటున్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అదృష్టం కలుగుతుందని నమ్ముతుంటారు. మీకు కూడా ఇలాంటి నమ్మకం ఉంటే, బంగారం కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోండి. స్వఛ్ఛతకు మన్నికకు మధ్య సమంగా ఉండండి: ఎక్కువ క్యారెట్స్ గల బంగారం స్వఛ్ఛంగా ఉంటుంది. కానీ ఆ బంగారం ఎక్కువ కాలం మనన్కపోవచ్చు. ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి వంగిపోయే ప్రమాదం ఉంది. ఎక్కువ కాలం మన్నాలి అనుకుంటే తక్కువ క్యారెట్ గల బంగారు నగలు సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే కొంత మెరుపు తక్కువగా ఉంటుంది. ఆభరణాలు తేలికగా ఉండాలంటే తక్కువ క్యారెట్ గల బంగారు ఆభరణాలు తీసుకోండి.
స్వఛ్ఛతకు, మన్నికకు సర్టిఫికేట్ తప్పనిసరి
బంగారం సర్టిఫికెట్ తెలుసుకోండి: బీఐస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్), ఐజీఐ( ఇంటర్నేషన్ల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్), జీఐఏ(జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా) హాల్ మార్క్ ఉన్న బంగారాన్నే కొనండి. తయారీ ధరల విషయాల్లో బేరం ఆడండి: బంగారు నగల తయారీ ధరలు అనేవి వాటి డిజైన్ల మీద ఆధారపడి ఉంటాయి. చాలామంది ఈ విషయంలో ఎక్కువ ఖర్చు పెడతారు. ఎక్కువ డిజైన్ లేని నగలకు తయారీ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. మీరు దేనికోసం కొనాలనుకుంటున్నారో ఆలోచించుకోండి: మీరు పెట్టుబడి కోసం బంగారాన్ని కొంటుంటే, దాని మన్నిక కాలం, స్వఛ్ఛత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆభరణం కోసం కొంటుంటే, దాని డిజైన్ వంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి.