PF Pension: 60 ఏళ్ల వయసులో పెన్షన్ లెక్కింపు.. ఎంత డబ్బు వస్తుందో తెలుసా?
భారతదేశంలో ప్రయివేటు రంగంలో పనిచేసే ప్రతి వ్యక్తికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా ఉంటుంది. ఈ ఖాతాలో ఉద్యోగికి కంపెనీ నెలవారీగా డబ్బు జమ చేస్తోంది. దాని మూలంగా ఉద్యోగుల భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచేందుకు ఫీఎఫ్ ఖాతా చాలా ఉపయోగకరంగా మారుతుంది. అయితే, మీరు 60 ఏళ్ల వయస్సుకు చేరే వరకు ఈ ఖాతాలో ఎంత మొత్తం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా ఉద్యోగి జీతంలో 12శాతం మొత్తాన్ని ఫీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఈ మొత్తంలో 8.33% పెన్షన్ ఫండ్‌కు, 3.67% ఫీఎఫ్ ఖాతాకు వెళ్ళుతుంది.
60 ఏళ్ల తర్వాత మీకు ఎంత పింఛను వస్తుంది?
ఈఫీఎఫ్ఓ నిబంధనల ప్రకారం 10 సంవత్సరాల పాటు ఫీఎఫ్ ఖాతాలో పెట్టుబడి పెట్టిన వ్యక్తి పెన్షన్ కోసం అర్హుడు అవుతాడు. 50 ఏళ్ల తర్వాత పెన్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, 58 ఏళ్లలోపు క్లెయిమ్ చేస్తే, ప్రతి సంవత్సరం 4% పెన్షన్ తగ్గుతుంది. 58 ఏళ్ల తర్వాత పెన్షన్ తీసుకోకపోతే, 60 ఏళ్ల వయస్సులో 8% పెరిగిన పెన్షన్ పొందవచ్చు. రూ. 15 వేలు జీతం పొందేవారు పెన్షన్ ఖాతాకు గరిష్టంగా 8.33% మాత్రమే జమ చేయవచ్చు. ప్రతి నెలా రూ. 1250 మాత్రమే పెన్షన్ ఖాతాలో జమ అవుతుంది. మీరు 23 సంవత్సరాల వయస్సులో ఉద్యోగం ప్రారంభించి, 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తే, మీరు 35 సంవత్సరాలు పనిచేస్తారు.
8శాతం పెరిగే అవకాశం
EPFO పాత పెన్షన్ పథకం ప్రకారం, గరిష్ట పెన్షన్ జీతం రూ. 15,000. ఇప్పుడు ఈ పెన్షన్ ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం. సగటు పెన్షన్ జీతం × సర్వీస్ సంవత్సరాలు ÷ 70 15000 × 35 ÷ 70 = 7500 మీరు 60 సంవత్సరాల వయస్సు వరకు పెన్షన్ క్లెయిమ్ చేయకపోతే, ఈ 7500 రూపాయల పెన్షన్ 8శాతం పెరుగుతుంది. పెరిగిన పెన్షన్ = 7,500 +600 = 8,100. ఈ పథకం ఉద్యోగులకు భవిష్యత్‌లో ఆర్థిక భద్రతను కల్పించడానికి ఎంతో సహాయపడుతుంది.