మీకు వడ అంటే ఇష్టమా? ఈ వెరైటీలను ఒకసారి ట్రై చేయండి
పొద్దున్న లేవగానే ఏ టిఫిన్ తిందామని వెతుక్కునే వారికి వడ ఊరిస్తూ ఉంటుంది. చట్నీ, సాంబర్ తో వడ తింటే వచ్చే ఆనందమే వేరు. ఈ వడల్లో చాలా రకాలుంటాయి. ప్రస్తుతం వడల్లోని రకాలను ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం. శనగపప్పు వడలు: శనగలను నీళ్ళలో 2గంటలు నానబెట్టి, నీళ్ళను తీసివేసి శనగలను గ్రైండర్ లో వేసి పేస్ట్ లాగా తయారు చేయాలి. దాన్ని ఒక పాత్రలో వేసి, ఉల్లిగడ్డ, అల్లం, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, కొత్తిమీర కలపాలి. ఆ తర్వాత పేస్ట్ తో వడ మాదిరిగా తయారు చేసి నూనెలో వేయించాలి. ఇప్పుడు మీకు కావాల్సిన చట్నీ, సాంబార్ రెడీ చేసుకుని హ్యాపీగా ఆరగించండి.
వడల్లోని మరిన్ని వెరైటీలను ఇక్కడ తెలుసుకోండి
సగ్గుబియ్యం వడలు: సగ్గుబియ్యాన్ని కడిగి గంటపాటు నీళ్ళలో నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని పారబొసి సగ్గుబియ్యాన్ని పక్కకు తీసుకోవాలి. ఉడకబెట్టిన బంగాళదుంపలను నలగ్గొట్టి పేస్ట్ లాగా చేసి సగ్గుబియ్యానికి కలపాలి. ఇంకా ధన్యాలు, పల్లీలు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ఆ పేస్ట్ ని వడల మాదిరి చేసి నూనెలో వేయించండి. మినప వడలు: మినప పప్పును 2గంటలు నానబెట్టి నీటిని పారబోయాలి. ఇప్పుడు మినప పప్పుకు మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం, నీళ్ళు, కరివేపాకు, ఉప్పు కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేయండి. ఆ పేస్ట్ లో ముక్కలుగా కోసిన ఉల్లిగడ్డలు వేయండి. వడ మాదిరిగా ఉండలుగా చేసి నూనెలో వేయించండి. బంగారు రంగులోకి వడలు మారగానే తినేయండి.