Page Loader
ట్రావెల్: చేతికి డబ్బులివ్వడం అమర్యాదగా భావించే కజకిస్తాన్ సాంప్రదాయాల గురించి తెలుసుకోండి
కజకిస్తాన్ లో చేయకూడని పనులు

ట్రావెల్: చేతికి డబ్బులివ్వడం అమర్యాదగా భావించే కజకిస్తాన్ సాంప్రదాయాల గురించి తెలుసుకోండి

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 10, 2023
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

మీకు విదేశీ పర్యటనలు చేయాలని కోరికగా ఉంటే, ఆయా దేశాల ఆచార వ్యవహారాలు, పద్దతుల గురించి ముందే తెలుసుకోండి. ఒకదేశంలో సాధారణంగా కనిపించే పద్దతి, మరో దేశంలో అసాధారణంగా అమర్యాదగా అనిపించవచ్చు. ప్రస్తుతం కజకిస్తాన్ పర్యటనకు వెళితే తెలుసుకోవాల్సిన పద్దతులేంటో చూద్దాం. చేతికి డబ్బులివ్వకూడదు: ఇది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ కజకిస్తాన్ చేతికి డబ్బులివ్వడం అమర్యాదగా ఉంటుంది. మీరు అవతలివారికి డబ్బులివ్వాలనుకుంటే ఒక చిన్న గిన్నెలో పెట్టి వారి ముందుకు జరపండి. లేదా క్యాష్ కౌంటర్ మీద డబ్బులను ఉంచండి. ఆహార అలవాట్లపై కామెంట్స్ చేయవద్దు: కజకిస్తాన్ ప్రజలు మాంసం ఎక్కువగా తింటారు. గుర్ర మాంసాన్ని ఇష్టంగా భుజిస్తారు. ఈ అలవాట్లపై మీరు నెగెటివ్ గా కామెంట్ చేస్తే మీకే ఇబ్బంది.

పర్యాటకం

బ్రెడ్ ని పవిత్రంగా భావించే కజకిస్తాన్ ప్రజలు

ఈవెంట్లకు తొందరగా వెళ్ళకండి: కజకిస్తాన్ ప్రజలు సమయపాలనలో కొంచెం దూరంగా ఉంటారు. కజకిస్తాన్ లో టైమ్ కి ఈవెంట్ స్టార్ట్ అవడం చాలా అరుదు. పెళ్ళిళ్ళయినా, ఇతర ఫంక్షన్లు అయినా అనుకున్న సమయానికి మొదలు కావు. బ్రెడ్ ని చెత్తకుప్పలో వేయకూడదు: కజకిస్తాన్ వారు బ్రెడ్ ని పవిత్రమైన ఆహారంగా భావిస్తారు. అందుకే బ్రెడ్ ని చెత్తకుప్పలో పారేయరు. పాడైపోయిన వాటిని ఒక పేపర్ లో చుట్టి పక్షుల కోసం ఇళ్ళముందు పెడతారు. తరతరాల నుండి ఈ అలవాటు కొనసాగుతూనే ఉంది. బయటకు వెళ్తే వేరే షూస్ వేసుకోవాలి: ఇల్లు, ఆఫీసు, ఫంక్షన్, వంటి ఇండోర్ స్థలాల్లో వేసుకునే షూస్ ని బయటకు తిరగడానికి వెళ్ళేటపుడు వేసుకోకూడదు.