ట్రావెల్: పోర్చుగల్ నుండి గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు
ఈ వార్తాకథనం ఏంటి
పోర్చుగల్ దేశంలో విభిన్న సంస్కృతులు మిమ్మల్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఆసక్తిని పెంచుతాయి. అత్యంత సుందర ప్రదేశాలు, నోరూరించే వంటకాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి.
వీటన్నంటినీ ఆ దేశంలో ఉండగా ఆనందించవచ్చు, మరి ఆ దేశం నుండి వచ్చాక ఆ దేశ గుర్తుగా మీ దగ్గర ఏదైనా వస్తువు ఉండాలనుకుంటే, పోర్చుగల్ లో బాగా పేరున్న ఆభరణాలు, డిజైన్ వస్తువుల గురించి తెలుసుకోవాలి.
కోడి బొమ్మ:
గాలో డీ బార్సిలోస్ అని పిలవబడే కోడి బొమ్మపై పోర్చుగల్ సంస్కృతిలో చాలా జానపద కథలు ఉన్నాయి.
పోర్ట్ వైన్:
పోర్చుగల్ నుండి వచ్చేటపుడు పోర్ట్ వైన్ కచ్చితంగా తీసుకొస్తారు. పోర్చుగల్ లోని డూరో వ్యాలీ లో తయారయ్యే ఈ వైన్, మంచి పండ్లరుచితో అద్భుతంగా ఉంటుంది.
ట్రావెల్
పోర్చుగల్ నుండి తీసుకురావాల్సిన వస్తువులు
పింగాణీ వస్తువులు
పోర్చుగల్ లో పింగాణీ వస్తువులు చాలా ఫేమస్. వివిధ రంగుల్లో, ఆకారాల్లో కనిపించే పింగాణీ పాత్రలను మీరు కొనవచ్చు. అజులోజోస్ అనే టైల్స్ ని ఇంటిలోపలి అలంకరణ కోసం లేదా బయటి అలంకరణ కోసం చాలామంది తీసుకెళ్తారు.
ఫిలిగ్రీ ఆభరణాలు:
సన్నని బంగారు తీగలను గానీ, వెండి తీగలను వివిధ రకాలుగా మలిచి తయారు చేసే ఆభరణాలకు పోర్చుగల్ బాగా ప్రసిద్ధి. పోర్టో, లిస్బో పట్టణాల్లో ఫిలిగ్రీ ఆభరణాలుండే దుకాణాలు అధికంగా కనిపిస్తాయి.
కార్క్ వస్తువులు:
ఓక్ చెట్ల బెరడు నుండి ఉత్పత్తి కార్క్ నుండి అనేక వస్తువులు తయారు చేస్తారు. పర్సులు, వ్యాలెట్లు, హ్యాండ్ బ్యాగ్స్, షూస్, చాపలు.. ఇలా రకరకాల వస్తువులు కార్క్ నుండి తయారవుతాయి.