ట్రావెల్: పోర్చుగల్ పర్యటనలో చేయకూడని తప్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ఘనమైన చరిత్ర, అందమైన ప్రదేశాలు, కలుపుగోలుగా ఉండే జనాలు పోర్చుగల్ దేశాన్ని సందర్శించేలా చేస్తాయి. మీ పర్యాటకంలో మంచి అనుభవాన్ని పొందడానికి పోర్చుగల్ పయనమవ్వండి.
అంతకంటే ముందు పోర్చుగల్ ప్రజల ఆచారాలు, వ్యవహారాలు తెలుసుకోండి. పోర్చుగల్ లో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
స్పానిష్, పోర్చుగల్ మధ్య కన్ఫ్యూజన్ వద్దు:
పోర్చుగల్ జనాలకు స్పానిష్ వస్తుంది. ఆ రెండు భాషలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. కానీ రెండూ వేరు వేరు. మీరు వాళ్ళతో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండండి. రెండు భాషలను మిక్స్ చేయవద్దు.
ఆహారంపై కామెంట్స్ వద్దు:
కల్చర్ లో ఆహారానికి ప్రత్యేక స్థానముంటుంది. అక్కడి ఆహారం మీకు నచ్చకపోతే దాని మీద నెగెటివ్ గా కామెంట్స్ చేయకండి.
పర్యాటకం
ఫుట్ బాల్ పై కామెంట్ చేస్తే మీరు ఫుట్ బాల్ ఐపోతారు
పోర్చుగల్ దేశంలో ఫుట్ బాల్ కి ఉన్న పేరు అంతా ఇంతా కాదు, ఇక్కడ మనకి క్రికెట్ ఎలాగో అక్కడ ఫుట్ బాల్ అలా అన్నమాట. అందుకే ఫుట్ బాల్ ని, ఫుట్ బాల్ ఆటగాళ్ళను విమర్శించవద్దు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియన్ రొనాల్డో పోర్చుగల్ దేశానికి చెందిన వాడని గుర్తుంచుకోండి.
వెయిటర్లకు ఎక్కువ టిప్స్ వద్దు:
పోర్చుగల్ లో వెయిటరు టిప్స్ ఆశించరు. సో, మీరు టిప్స్ ఇవ్వకపోవడమే మంచిది. ఒకవేళ ఇద్దామనుకున్నా తక్కువగా ఇవ్వండి. మరీ ఎక్కువగా ఇవ్వడం మంచిది కాదని తెలుసుకోండి.
ఈ విషయాలు తెలుసుకోకుండా పోర్చుగల్ వెళ్తే అక్కడి స్థానికుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.