ట్రావెల్: సందర్శన కోసం వేరే ప్రాంతం వెళ్ళిన ప్రతీసారీ ఆరోగ్యం దెబ్బతింటుందా? ఇలా చేయండి
ట్రావెలింగ్ కొందరికి బాగా ఇష్టముంటుంది. కానీ కొంతమందికి ట్రావెలింగ్ చేస్తుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కొత్త ప్రాంతానికి వెళ్లగానే అలసిపోవడం, నీరసంగా మారిపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి ఇబ్బందులు మీకు కూడా ఎదురైతే మేమిచ్చే కొన్ని సలాహాలు పాటించండి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోండి: హానిచేసే బాక్టీరియా, సూక్ష్మక్రిములు చేతుల ద్వారానే నోట్లోకి వెళ్తాయి. అందుకే మీరెక్కడికి వెళ్ళినా చేతులు కడుక్కోవడం మర్చిపోవద్దు. మీ బ్యాగులో ఎప్పుడూ 60% ఆల్కహాల్ కలిగి ఉన్న శానిటైజర్ ఉండేలా చూసుకోండి. అప్పుడే వండిన ఆహారాలనే తినండి: నీళ్ళు తాగేటప్పుడు, ఆహారం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వండిన వేడి వేడి ఆహారాలనే తినండి. ఏది పడితే అది తింటే మీ కడుపు అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ట్రావెల్ చేసినపుడు ఆరోగ్య ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు
కొత్త ప్రాంతం వెళ్లారు కదా అని కొత్త ఫుడ్స్ ట్రై చేయాలనుకుంటే ఒక్కోసారి పప్పులో కాలేసినట్టు అవుతుంది. కొత్త ఆహారాలు ఏ రకమైన ఆహార పదార్థాలతో తయారు చేస్తారో, అవి ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మీ కడుపు అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్టివ్ గా ఉండండి: హాలీడే కి వెళ్ళినపుడు ఎక్సర్ సైజ్ చేయడం మానేస్తుంటారు. అదే తప్పు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎక్సర్ సైజ్ చాలా సాయపడుతుంది. అందుకే ఎక్సర్ సైజ్, ధ్యానం చేయండి. ప్రో బయోటిక్స్: మంచి బాక్టీరియా, ప్రో బయోటిక్స్ కారణంగా శరీరానికి రోగనిరోధక శక్తి అందుతుంది. అందుకే మీ ట్రిప్ కి రెండు వారాల ముందు నుండి ప్రో బయోటిక్స్ తీసుకుంటూ ఉండండి.