ట్రావెల్: ఈజిప్టు వెళ్తున్నారా? అక్కడ ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకోండి
ఏ ప్రాంతానికి పర్యటనకు వెళ్ళినా అక్కడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేదంటే ఆ ప్రాంతపు స్థానికుల కారణంగా మీకు ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతమ్ ఈజిప్టు వెళ్తే ఎలా మసులుకోవాలో తెలుసుకుందాం. టిప్స్ ఇవ్వడం మర్చిపోవద్దు: ఈజిప్ట్ లో టిప్స్ ఇవ్వడమనేది ఒన ఆనవాయితీ. అక్కడ మీరు దిగిన క్షణం నుండి ట్యాక్సీ డ్రైవర్ నుండి మొదలుపెడితే హోటల్ లో మీకు హెల్ప్ చేసే వ్యక్తి వరకూ టిప్స్ ఇవ్వాలి. లేదంటే అవతలి వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. మరీ క్లోజ్ గా ఉండకూడదు: పబ్లిక్ ప్లేసెస్ లో మీ పార్ట్ నర్లతో మరీ క్లోజ్ గా ఉండకూడదు. చేతిలో చేయి వేసి నడవడం ఓకే కానీ కౌగిలింతలు, మీద పడిపోవడాలు అక్కడ కుదరవు.
దేవుడంటే నమ్మకం లేకపోతే లోపలే దాచేసుకోవాలి
ఈజిప్ట్ లో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. అక్కడ దేవుడిని నమ్మేవారే ఎక్కువ. కాబట్టి మీకు దేవుడంటే ఇష్టం లేకపోయినా, మీకు నమ్మకాలు లేకపోయినా బహిరంగంగా చెప్పకపోవడమే మంచిది. ఆతిధ్యాన్ని వద్దనకండి: ఈజిప్ట్ వారు మీకు ఆతిధ్యం ఇస్తామని ఆహ్వానిస్తే వద్దనవద్దు. డిన్నర్ కి గానీ, లంచ్ కి గానీ పిలిస్తే వెళ్లాలి. లేదంటే తమపట్ల మీకు నమ్మకం లేదని అనుకుని వాళ్ళు బాధపడతారు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆతిధ్యాన్ని కాదనవద్దు. వేలు పెట్టి చూపించవద్దు: ఎవరైనా మనుషులను వేలు పెట్టి చూపించడం లాంటివి ఈజిప్ట్ లో అస్సలు చేయకండి. దాన్ని వాళ్ళు అమర్యాదగా భావిస్తారు. మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాటల ద్వారానో, లేదా చిన్నగా భుజం తట్టడం ద్వారానో చెప్పాలి.