
ట్రావెల్: పెరూ దేశానికి వెళ్తున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి
ఈ వార్తాకథనం ఏంటి
పెరూ.. ఆండీస్ పర్వతాలు, అమెజాన్ అడవులను, అప్పటి కాలం నాటి నిర్మాణాలను చూడాలనుకుంటే పెరూ వెళ్ళాల్సిందే. ఐతే ఈ దేశంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని ఆచారాలను తెలుసుకోవాలి.
లేదంటే అక్కడి స్థానికులు మీ వల్ల ఇబ్బంది పడతారు. దానివల్ల మీరు కూడా ఇబ్బంది పడాల్సివస్తుంది.
పెరూ దేశస్తులు దగ్గరగా వస్తే భయపడకండి: పెరూ దేశ ప్రజలు, ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కొంచెం క్లోజ్ గా వస్తారు. భుజం మోద చేయి వేస్తారు. అది చూసి మీరు ఇబ్బంది పడిపోవద్దు.
అది వాళ్ళ అలవాటు. వాళ్ళను ఏదైనా అడిగినపుడు, కొంచెం దగ్గరగా వచ్చి, చిన్న చేతి స్పర్శ తగిలించి సమాధానం చెప్పడం వాళ్ళకు అలవాటు. కాబట్టి కంగారు పడవద్దు.
పర్యాటకం
పెరూ దేశంలోని ప్రాంతాలు చూడడానికి వెళ్ళినపుడు చేయకూడని పొరపాట్లు
పసుపు రంగు పూలు బహుమతిగా ఇవ్వకండి:
మీకెవరైనా పెరూ దేశంలో స్నేహితులు ఉన్నట్లయితే వాళ్ళకు పసుపు రంగు పూలను బహుమతిగా ఇవ్వవద్దు. పసుపు రంగు పూలను ఎవరైనా చనిపోయిన సమయంలో లేదా దుఃఖంగా ఉన్న సమయంలో మాత్రమే ఇస్తారు.
ఒళ్ళు కనిపించేలా బట్టలు వద్దే వద్దు:
మీ చర్మం కనిపించేలా బట్టలు వేసుకోవద్దు. ఐతే ఈ డ్రెస్ విధానాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. కాకపోతే షార్ట్స్, స్కర్ట్స్ వేసుకోవద్దు. మరీ ముఖ్యంగా పెరూలోని మ్యూజియం, పురాతన నిర్మాణాలు, చర్చి సందర్శనకు వెళ్ళినపుడు ఒళ్ళు కనిపించేలా బట్టలు అస్సలు వేసుకోవద్దు.
పబ్లిక్ ప్రాంతాల్లో తినకూడదు:
ఏదైనా మతానికి సంబంధించిన పండగలు జరిగినపుడు పబ్లిక్ ప్రాంతాల్లో తినడం, తాగడం చేయరాదు.