
ట్రావెల్: జపాన్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని పనులు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ దేశంలో ఆచారాలు, వ్యవహారాలు వేరు వేరుగా ఉంటాయి. మీరు ఈ దేశంలో సరైనదే అనుకున్న పని వేరే దేశంలో కాకపోవచ్చు. పర్యటన కోసం జపాన్ దేశానికి వెళ్ళాలనుకుంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో చూద్దాం.
స్కూలు, రెస్టారెంట్, వర్క్ ప్లేస్ లో షూస్ వేసుకోకూడదు: ఆసియా దేశాల్లో గుడి, మసీదు, చర్చి వంటి ప్రార్థనా స్థలాల్లోకి షూస్ వేసుకుని వెళ్ళకూడదు.
కానీ జపాన్ లో స్కూల్, రెస్టారెంట్, వర్క్ ప్లేస్ లో కూడా షూస్ వేసుకోవద్దు. ఒకవేళ వేసుకుంటే గౌరవం ఇవ్వనట్టుగా ఫీలవుతారు.
పబ్లిక్ ప్లేస్ లో పెద్దగా శబ్దాలు చేయకూడదు: రోడ్డు మనదే కదా ఏమవుతుందనుకుని ఇష్టం వచ్చినట్టుగా అరిస్తే వాళ్ళు ఊరుకోరు. జపాన్ దేశస్తులు చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు.
ట్రావెల్
జపాన్ వెళ్ళాలనుకుంటే తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
శుభ్రంగా ఉండాలి: మీరు జపాన్ వీధుల్లోకి వచ్చినపుడు వ్యక్తిగత శుభ్రత ఖచ్చితంగా పాటించాలి. శుభ్రంగా లేని బట్టలు ధరించినా, వ్యక్తిగత శుభ్రత పాటించకపోయినా వాళ్ళు సహించరు.
మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఎప్పుడూ ఉంచుకోవాలి. తుమ్మినా దగ్గినా టిష్యూ అడ్డం పెట్టుకోవాలి. ఎలాంటి అడ్డంకి లేకుండా తుమ్మకూడదు. అలాగే పబ్లిక్ ప్లేస్ లో ముక్కు చీదడం కూడా జపాన్ వాసులకు నచ్చదు.
ప్రయాణాల్లో తినవద్దు: జపాన్ రైళ్ళలో, బస్సుల్లో తినకూడదని గుర్తుంచుకోండి. దానివల్ల అవతలి ప్రయాణీకులకు ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. అందుకే జర్నీలో వాళ్ళు భోజనం చేయరు.
చాప్ స్టిక్స్ వాడకం తెలియాలి: ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినపుడు చాప్ స్టిక్స్ తో పాయింట్ అవుట్ చేయవద్దు. అది వాళ్ళకు నచ్చదు.