కొత్తగా టాటూ వేసుకున్నారా? మొదట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి
కొత్తగా వేసుకున్న టాటూని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే టాటూ తొందరగా చెరిగిపోవడం, చర్మానికి ఇబ్బందులు కలగడం జరుగుతుంటుంది. టాటూ వేసుకున్న కొత్తలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. మొదటి రోజు టాటూను కప్పేయండి: టాటూ వేసిన తర్వాత దాని మీద టాటూ ఆర్టిస్ట్, ఒక యాంటిబయోటిక్ ఆయింట్ మెంట్ పూస్తారు. ఆ తర్వాత దాని మీద బ్యాండేజీ వేస్తారు. ఈ బ్యాండేజీని 2-3గంటల పాటు ఉంచుకోవాలి. బాక్టీరియాలు మీ చర్మాన్ని పాడుచేయకుండా ఉండడానికి టాటూని కప్పి ఉంచడమే కరెక్ట్. గోరువెచ్చని నీళ్లతో కడగండి: 3గంటల తర్వాత బ్యాండేజీ తీసేసి, గోరు వెచ్చని నీళ్లతో టాటూని కడగాలి. దీనివల్ల రక్తపు మరకలు, టాటూ ఇంక్ ఈజీగా తొలగిపోతాయి.
టాటూ గాయాలు మానే వరకూ మాయిశ్చరైజర్ వాడాల్సిందే
మాయిశ్చరైజర్ వాడండి: టాటూ పొడిబారిన తర్వాత దానిమీద మాయిశ్చరైజర్ ని అప్లై చేయండి. అది కూడా ఎలాంటి సెంట్ సుగంధాలు లేని మాయిశ్చరైజర్ ని మాత్రమే వాడాలి. పెట్రోలియం జెల్స్ అస్సలు వాడరాదు. గాయాలు మానేదాకా మాయిశ్చరైజర్ తప్పనిసరి: టాటూ వల్ల చర్మానికి గాయమవుతుంది. ముఖ్యంగా చర్మం ఒరుసుకు పోయినట్టుగా అవుతుంది. ఒరుసుకు పోయిన గాయాలు మానే వరకు టాటూని శుభ్రపరిస్తూ మాయిశ్చరైజర్ ని అప్లై చేయాలి. టాటూ మీద ఎండ పడనివ్వకండి: టాటూ మీద గాయం మానుతున్నప్పుడు మీకు తెలిసిపోతుంది. అలాంటప్పుడు మీరు గాయాన్ని ముట్టుకోవద్దు. దురద పెడితే మాయిశ్చరైజర్ వాడాలి. అలాగే 3-4వారాల పాటు టాటూ మీద ఎండ పడనివ్వకండి. ఆ తర్వాత టాటూ మీద సన్ స్క్రీన్ వాడండి