
చర్మానికి మెరుపును తీసుకురావడం నుండి నల్లమచ్చలను పోగొట్టడం వరకు తులసి చేసే మేలు
ఈ వార్తాకథనం ఏంటి
మన ఇళ్ళలో తులసి చెట్టుకు దివ్యమైన ప్రాముఖ్యం ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరి ఇళ్ళలో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీకిది తెలుసా? తులసి మొక్క చర్మానికి మంచి మేలు చేస్తుంది.
ప్రస్తుతం చర్మానికి తులసి ఎలాంటి మేలు చేస్తుందో చూద్దాం.
చర్మాన్ని శుభ్రపరుస్తుంది:
జిడ్డు చర్మం గలవారు తులసిని ఉపయోగించే మంచి ప్రయోజనం ఉంటుంది. జిడ్డు కారణంగా మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తులసి వల్ల తెరుచుకుంటాయి.
తులసి ఆకులను తీసుకుని బాగా కడిగి, వాటితో రసం చేసి అందులో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి మాస్క్ లాగా మర్దన చేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే సరిపోతుంది. వారానికి రెండుసార్లు చేయవచ్చు.
చర్మ సంరక్షణ
మొటిమలను, బ్లాక్ హెడ్స్ ను పోగొట్టే తులసి
మొటిమలను పోగొడుతుంది:
ముఖం మీద మొటిమలను పోగొట్టడంలో తులసి బాగా పనిచేస్తుంది. తులసిలోని లక్షణాలు మొటిమలను పోగొట్టి, చర్మాన్ని రక్షిస్తాయి. అంతేకాదు, చర్మాన్ని శుభ్రపరిచి తిరిగి కాంతివంతమైన చర్మాన్ని అందిస్తాయి.
బ్లాక్ హెడ్స్ మాయమైపోతాయి:
చనిపోయిన చర్మకణాలు చర్మం మీదే ఉండడం వల్ల బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. వీటిని పోగొట్టడానికి 25తులసి ఆకులను, 25వేప ఆకులను తీసుకుని వాటిని గ్రైండ్ చేసి, ఆ పేస్ట్ కి కొంచెం తేనెను కలిపి ముఖానికి మర్దన చేసుకుంటే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
తేమను కాపాడుతుంది:
చర్మం పొడిబారివడాన్ని తులసి నివారిస్తుంది. తులసి ఆకులతో చేసిన ఫేస్ ప్యాక్ ని ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారిపోవడం తగ్గిపోతుంది. దానివల్ల చర్మం తేమగా ఉండి, అందంగా మెరుస్తూ ఉంటుంది.