బిడ్డకు జన్మనిచ్చాక చర్మాన్ని, జుట్టును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు టిప్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రెగ్నెన్సీ అనేది అందమైన ప్రయాణం. ఆ తొమ్మిది నెల్లల్లో మీలో రకరకాల మార్పులు కలుగుతుంటాయి. ఐతే బిడ్డ పుట్టాక కొందరి శరీరాల్లో కొన్ని మార్పులు వస్తుంటాయి.
ఉదాహరణకు జుట్టు రాలిపోవడం, చర్మంపై తేమ తగ్గిపోవడం, ఇంకా కొందరిలో అలసట కనిపిస్తుంటుంది. దీన్నుండి బయటపడానికి జువెనల్ హెర్బల్స్ సీఈవో మేధాసింగ్ కొన్ని టిప్స్ ఇస్తున్నారు.
నెత్తిమీద తేమను ఉండనివ్వండి:
ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల కలిగే ఒత్తిడి కారణంగా జుట్టు రాలిపోవడం జరుగుతుంటుంది. అందుకే నెత్తి మీద తేమను ఉంచుకునేందుకు, కావాల్సినన్ని నీళ్ళు తాగడం, హెర్బల్ టీ తీసుకోవడం చేస్తుండాలి.
వారంలో ఒకసారి గుడ్డులోని తెల్లసొన లేదా ఆలివ్ ఆయిల్ తో జుట్టుకు మర్దన చేసి, కడిగేసుకోవాలి.
ప్రెగ్నెన్సీ
చర్మాన్ని సురక్షితంగా ఉంచే బాడీ మసాజ్
బిడ్డకు జన్మనిచ్చాక చర్మంలో మార్పులు వచ్చి మొటిమలు, మంగు, నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బాడీ మసాజ్ తో పాటు పసుపు శనగపిండి కలగలిపి దానికి కొంచెం పుదీనా, కుంకుమపువ్వు కలిపి శరీరానికి మర్దన చేసుకుని స్నానం చేయాలి.
చర్మానికి మెరిసే గుణాన్నిచే కుంకుమాది తైలం:
చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా, మొటిమలు లేకుండా చేయాలంటే కుంకుమాది తైలం వాడండి. ఇది బాగా పనిచేస్తుంది.
ఫేస్ మాస్క్:
బిడ్డకు జన్మనిచ్చాక మొటిమలు, నల్లమచ్చలు విపరీతంగా పెరిగితే గనక సాధారణంగా వాడే ఫేస్ మాస్క్ ను కూడా కొంతమంది ఉపయోగిస్తారు. గ్రీన్ టీ తో తయారైన ఫేస్ ప్యాక్ వాడవచ్చు. అలాగే పాలల్లో కుంకుమపువ్వు కలిపి మంగు మచ్చలున్న ప్రాంతాల్లో మర్దన చేయండి.