హోళీ రంగులు మీ జుట్టును పాడుచేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు
హోళీ ఆడే సమయంలో రంగుల్లోని రసాయనాలు చర్మం మీదా, జుట్టు మీద పడతాయి. వీటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే చిరాకును కలిగిస్తుంటాయి. అందుకే హోళీ తర్వాత చర్మం గురించి, జుట్టు గురించి శ్రద్ధ తీసుకోవాలి. జుట్టు పొడిబారడం, మృదుత్వం కోల్పోవడం మొదలగు అనేక జుట్టు సమస్యలు రంగుల్లోని రసాయనాల వల్ల వస్తుంటాయి. రంగుల వల్ల మీ జుట్టు దెబ్బతినకుండా ఉండానికి హోళీ తర్వాత ఏం చేయాలో చూద్దాం. జుట్టును కడగండి: హోళీ అయ్యాక ముందుగా జుట్టును చల్లని నీటితో కడగండి. వెంట్రుకల పై ఉన్న రంగు పూర్తిగా వదిలే వరకు రెండు మూడుసార్లు నీళ్ళతో కడగాలి. ఆ తర్వాత షాంపూ, కండీషనర్ ఉపయోగించి జుట్టును శుభ్రపరచాలి.
హోళీ రంగులు జుట్టును పాడుచేయకుండా ఉండేందుకు పాటించాల్సిన పద్దతులు
కొబ్బరి నూనె: జుట్టుకు కొబ్బరి నూనె తో మర్దన చేయాలి. దీనివల్ల ఫంగస్ ఏర్పడకుండా ఉండి చుండ్రు రాకుండా ఉంటుంది. రంగుల్లోని రసాయనాల కారణంగా ఫంగస్ ఏర్పడే అవకాశం ఎక్కువ. నిమ్మరసం: దీనిలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి, అందువల్ల జుట్టులోని రసాయనాలు ఇది పోగొడుతుంది. ఒక పాత్రలో కొంత నిమ్మరసం, పెరుగు వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు మాస్క్ లాగా పెట్టుకోవాలి. 10నిమిషాల తర్వాత రెగ్యులర్ షాంపూ లేదా కండీషనర్ తో కడిగితే సరిపోతుంది. కండీషనర్: జుట్టును చల్లని నీటితో కడిగి, షాంపూ చేసిన తర్వాత కండిషనర్ ని మర్చిపోవద్దు. జుట్టు కోల్పోయిన తేమను తిరిగి రప్పించడంలో కండీషనర్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. దానివల్ల మీ జుట్టు అందంగా ఉంటుంది.